హోమ్‌ లోన్‌ @ 6.40%.. వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర

ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. 6.40 శాతానికే హోమ్‌ లోన్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది.

Published : 12 Dec 2021 18:33 IST

దిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. 6.40 శాతానికే హోమ్‌ లోన్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. గతంలో 6.80 శాతంగా ఉన్న వడ్డీ రేటును సవరిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. రిటైల్‌ బొనాంజా ఫెస్టివ్‌ ధమాకా పేరిట ఈ ఆఫర్‌ను ప్రకటించింది. డిసెంబర్‌ 13 నుంచి తగ్గించిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని పేర్కొంది.

కారు లోన్‌పై సైతం వడ్డీరేట్లను బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర తగ్గించింది. గతంలో 7.05 శాతం ఉండగా మార్కెట్‌ పోటీని దృష్టిలో ఉంచుకుని 6.80 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది. క్రెడిట్‌ స్కోరు ఆధారంగా వడ్డీ రేటు వర్తిస్తుందని తెలిపింది. బంగారు, గృహ, కారు లోన్‌పై ప్రాసెసింగ్‌ ఫీజును రద్దు చేసినట్లు పేర్కొంది. ఫెస్టివ్‌ బొనాంజాను వినియోగించుకోవడం ద్వారా వినియోగదారులు రుణాలపై పెద్ద మొత్తంలో ఆదా చేసుకోగలుగుతారని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హేమంత్‌ తామ్టా అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు