పార్లమెంట్‌ ఆమోదం దివాలా స్మృతి సవరణ బిల్లుకు

ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ కోడ్‌ (సవరణ) బిల్లు-2021కు మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. పెగాసస్‌ వివాదం, ఇతర సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేస్తున్నా, స్వల్ప చర్చతో బిల్లు ఆమోదం పొందింది.

Published : 04 Aug 2021 01:20 IST

దిల్లీ: ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ కోడ్‌ (సవరణ) బిల్లు-2021కు మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. పెగాసస్‌ వివాదం, ఇతర సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేస్తున్నా, స్వల్ప చర్చతో బిల్లు ఆమోదం పొందింది. జులై 28న లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థల (ఎంఎస్‌ఎంఈలు) కోసం ముందుగా నిర్దేశించిన (ప్రీ-ప్యాకేజ్డ్‌) దివాలా పరిష్కార యంత్రాంగాన్ని దివాలా స్మృతి (సవరణ) బిల్లు 2021 అందిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈలను దృష్టిలో ఉంచుకుని దివాలా స్మృతికి సవరణలు చేసినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు