బ్యాంకు వైఫ‌ల్య‌మైతే డిపాజిట్ బీమా మీకు నేరుగా ల‌భిస్తుందా?

అధికారిక లిక్విడేటర్లను సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది

Published : 15 Apr 2021 16:20 IST

నేడు, భారతదేశంలో పనిచేస్తున్న విదేశీ బ్యాంకుల శాఖలు, స్థానిక‌ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా అన్ని వాణిజ్య బ్యాంకులు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) బీమా చేస్తాయి.  అంతేగాక, మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులతో డిపాజిట్లు కలిగి ఉంటే, ప్రతి బ్యాంకులోని డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్ పరిమితి విడిగా వర్తిస్తుంది.
 ‌అయితే, లిక్విడేషన్ విషయంలో, డిపాజిట్ ఇన్సూరెన్స్ విఫలమైన బ్యాంకుల డిపాజిటర్లకు నేరుగా చెల్లిస్తుందా? ఎప్పుడు చెల్లిస్తుంది? తెలుసుకుందాం. 
మీరు బ్యాంకులో డిపాజిట్ చేసేట‌ప్పుడు సందేహం ఉంటే, మీ బ్యాంక్ డీఐసీజీసీ చేత బీమా హామీ ఉందా అని బ్రాంచ్ అధికారిని అడిగి తెలుసుకోవ‌చ్చు. 
డిపాజిట్ ఇన్సూరెన్స్ పథకం తప్పనిసరి అని మీరు తెలుసుకోవాలి. ఏ బ్యాంకుకైనా ఇది వ‌ర్తిస్తుంది. వరుసగా మూడు సార్లు ప్రీమియం చెల్లించడంలో విఫలమైతే డీఐసీజీసీ  బీమా చేసిన బ్యాంకు నమోదును రద్దు చేయ‌వ‌చ్చు.
డిపాజిట్ బీమా పథకం ప్రకారం, బ్యాంకులోని ప్రతి డిపాజిటర్ అతని / ఆమె వద్ద ఉన్న అసలు, వడ్డీ మొత్తానికి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు బీమా హామీ ఉంటుంది. బ్యాంకు లిక్విడేషన్‌కి వెళ్లిన‌ప్పుడు,  బ్యాంకు  లైసెన్స్ ద‌ర్దు చేసినా లేదా బ్యాంకులు మరొక బ్యాంకులో విలీనం చేసినా ఇది వ‌ర్తిస్తుంది.

కాబట్టి, ఒక బ్యాంకు లిక్విడేషన్‌లోకి వెళితే, డిపాజిట్ ఇన్సూరెన్స్ లిక్విడేటర్ లేదా నియమించబడిన అధికారికి ప్రతి డిపాజిటర్ క్లెయిమ్ మొత్తాన్ని నియమించబడిన అధికారి నుంచి క్లెయిమ్ జాబితాను స్వీకరించిన తేదీ నుంచి రెండు నెలల్లోపు రూ. 5 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది.

నియమిత‌ అధికారి డిపాజిటర్ వారీగా క్లెయిమ్ జాబితాను తయారు చేసి, పరిశీలన, చెల్లింపు కోసం డీఐసీజీసీకి పంపుతాడు. ఒకసారి, జాబితా పరిశీలించి, ప్రతి బీమా డిపాజిటర్‌కు వారి క్లెయిమ్ మొత్తానికి అనుగుణంగా  అధికారి పంపిణీ చేస్తారు. అధికారిక లిక్విడేటర్లను సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఏదేమైనా, ఒక బ్యాంకు పునర్నిర్మాణం జ‌రిగితే లేదా మరొక బ్యాంకులో విలీనం చేస్తే, డిపాజిట్ బీమా సంబంధిత బ్యాంకుకు చెల్లిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని