ఛార్జీలు వ‌ర్తించ‌ని ఏటీఎం లావాదేవీలు

బ్యాంకులు త‌మ పొదుపు వినియోగ‌దారుల‌కు నెల‌కు కొన్ని లావాదేవీలు ఉచితంగా చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తాయి. పరిమితికి మించి ఎక్కువ‌సార్లు లావాదేవీలు చేస్తే ఛార్జీలు వ‌ర్తిస్తాయి. అయితే కొన్ని ర‌కాల లావాదేవీలు ఛార్జీలు వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని బ్యాంకుల‌కు ఆర్‌బీఐ సూచించింది. అవి ఏంటంటే…..

Updated : 01 Jan 2021 19:29 IST

బ్యాంకులు త‌మ పొదుపు వినియోగ‌దారుల‌కు నెల‌కు కొన్ని లావాదేవీలు ఉచితంగా చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తాయి. పరిమితికి మించి ఎక్కువ‌సార్లు లావాదేవీలు చేస్తే ఛార్జీలు వ‌ర్తిస్తాయి. అయితే కొన్ని ర‌కాల లావాదేవీలు ఛార్జీలు వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని బ్యాంకుల‌కు ఆర్‌బీఐ సూచించింది. అవి ఏంటంటే…

1.ఏవైనా సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగా లావాదేవీలు ర‌ద్దు అయితే అవి లావాదేవీలుగా లెక్కించ‌కూడ‌ద‌ని తెలిపింది. అటువంటి సంద‌ర్భాల్లో ఛార్జీలు వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని సూచించింది.

2.ఏటిఎం మిష‌న్ల‌లో స‌రిప‌డినంత న‌గ‌దు లేక‌పోవ‌డం, పిన్ నంబ‌ర్ త‌ప్పుగా ఎంట‌ర్ చేయ‌డం వంటి కార‌ణాల చేత లావాదేవీలు ర‌ద్దు అయితే వీటిపై ఛార్జీలు వ‌ర్తించ‌వు.

3.ఖాతాలో బ్యాలెన్స్ వివ‌రాలు, చెక్ బుక్ అభ్య‌ర్థ‌న‌, ప‌న్ను చెల్లింపులు, న‌గ‌దు బ‌దిలీ చేయ‌డం వంటివి లావాదేవీలుగా ప‌రిగ‌ణించ‌కూడ‌దని చెప్పింది.

ఆర్‌బీఐ తాజా నివేదిక ప్ర‌కారం మార్చి 2019 నాటికి ఏటిఎం లావాదేవీల సంఖ్య 2.22 ల‌క్ష‌లుగా ఉంది. గ‌తేడాది ఇది 2.21 ల‌క్ష‌లు. ఆర్‌బీఐ వార్షిక నివేదిక‌లో, బ్యాంకులు వైట్‌లేబుల్ ఏటీఎంల భాగ‌స్వామ్యంతో కో-బ్రాండెడ్ ఏటీఎం కార్డుల‌ను జారీచేయ‌వ‌చ్చ‌ని తెలిపింది. దీంతో సొంత బ్యాంకు ఏటీఎంల‌లో లావాదేవీలు జ‌రుపుకునేవారికి బ్యాంకు ఇచ్చే ఉచిత లావాదేవీల ప‌రిమితి పెరిగి ఛార్జీలు త‌గ్గే అవ‌కాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని