డిమాండ్ డ్రాఫ్ట్

డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ) అనేది  ముంద‌స్తు నగదు చెల్లింపు విధానం. ఎవ‌రి పేరు మీద డీడీ జారీ చేస్తారో వారికి మాత్ర‌మే న‌గ‌దును చెల్లిస్తారు. డీడీ చెల్లింపుల‌ను  బ్యాంకు శాఖ నుంచి నేరుగా నగదు రూపంలో లేదా ఖాతాలోకి పొందవచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్ జారీ చేసేవారికి అదే  బ్యాంకులో ఖాతా ఉండాలన్న నిబంధన లేదు. నగదు చెల్లించి కూడా డీడీని తీయవచ్చు. జారీ చేసిన డీడీని..

Published : 15 Dec 2020 17:51 IST

డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ) అనేది  ముంద‌స్తు నగదు చెల్లింపు విధానం. ఎవ‌రి పేరు మీద డీడీ జారీ చేస్తారో వారికి మాత్ర‌మే న‌గ‌దును చెల్లిస్తారు. డీడీ చెల్లింపుల‌ను  బ్యాంకు శాఖ నుంచి నేరుగా నగదు రూపంలో లేదా ఖాతాలోకి పొందవచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్ జారీ చేసేవారికి అదే  బ్యాంకులో ఖాతా ఉండాలన్న నిబంధన లేదు. నగదు చెల్లించి కూడా డీడీని తీయవచ్చు. జారీ చేసిన డీడీని ల‌బ్దిదారుడికి అంద‌జేస్తే, ల‌బ్దిదారులు బ్యాంకులో దానిని స‌మ‌ర్పించి న‌గ‌దును పొంద‌వ‌చ్చు.

  • డిమాండ్ డ్రాఫ్ట్ చెల్లింపులు పొందేందుకు 2 నుంచి 3 రోజులు పడుతుంది.

  • డీడీ తీసిన రోజు నుంచి మూడు నెలల పాటు చెల్లుబాటు అవుతుంది.

  • రూ. 20 వేల కంటే ఎక్కువ విలువ క‌లిగిన డీడీల‌న్నింటినీ త‌ప్ప‌నిస‌రిగా క్రాస్ చేయాల‌ని ఆర్‌బీఐ నిబంధ‌న విధించింది. క్రాస్ చేసిన డీడీని ఖాతాలోనే జ‌మ చేస్తారు. ఈ విధ‌మైన డీడీల‌కు బ్యాంకులు నేరుగా న‌గ‌దు చెల్లించ‌వు.

  • రూ. 50 వేల కంటే డీడీ విలువ ఎక్కువ‌గా ఉంటే, చెక్కు రూపంలోనే చెల్లింపు చేయ‌డంతో పాటు, పాన్ నెంబర్ పేర్కొనాల్సి ఉంటుంది.

రుసుములు

  • డీడీని జారీ చేసేందుకు బ్యాంకులు నిర్డేశించిన రుసుములను వసూలు చేస్తాయి.
  • ఈ రుసుములు బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి.
  • సాధారణంగా 2 నుంచి 50 రూపాయలతో పాటు, సేవా పన్నును కలిపి రుసుముగా వసూలు చేస్తారు.

డిమాండ్ డ్రాఫ్ట్‌ ఆన్‌లైన్‌లో

ప్ర‌స్తుతం ప్ర‌ధాన బ్యాంకుల‌న్నీ డిమాండ్ డ్రాఫ్ట్‌ను ఆన్‌లైన్ ఆర్డ‌ర్ చేసే స‌దుపాయం క‌ల్పిస్తున్నాయి. ఇందుకోసం కింది వివ‌రాలు అద‌నంగా అవ‌స‌రమ‌వుతాయి.

  • ల‌బ్ధిదారు బ్యాంకు ఖాతా సంఖ్య‌
  • ల‌బ్ధిదారు మొబైల్ నంబరు
  • డీడీని రిజిస్ట‌ర్ పోస్ట్‌ లేదా కొరియర్ ద్వారా పంపాలా అనే వివరాలు
  • మెయిల్ ఐడీ
  • ఆన్‌లైన్‌లో డీడీ జారీ చేసేందుకు రూ. 10 వేల వ‌ర‌కూ రూ. 50 రుసుము విధించే అవ‌కాశం ఉంది.
  • డిమాండ్ డ్రాఫ్ట్ జారీ కావాలంటే ఖాతాలో త‌గినంత సొమ్ము ఉండాలి.
  • డీడీ రుసుముల‌ను ఖాతా నుంచే మిన‌హాయిస్తారు.
  • దాదాపు చాలా బ్యాంకులు ఆన్‌లైన్ డీడీ అభ్య‌ర్థ‌న‌ను మెయిల్‌లోనే తెలియ‌జేస్తాయి
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని