ఈఎల్ఎస్ఎస్‌లో సిప్ ద్వారా పెట్టుబ‌డులు

సిప్ ద్వారా ఈఎల్ఎస్ఎస్‌లో పెట్టుబ‌డులు పెడితే ప‌న్ను ఆదాతో పాటు చాలా లాభాలున్నాయి​​​​​​....

Published : 18 Dec 2020 13:52 IST

సిప్ ద్వారా ఈఎల్ఎస్ఎస్‌లో పెట్టుబ‌డులు పెడితే ప‌న్ను ఆదాతో పాటు చాలా లాభాలున్నాయి

ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్ స్కీమ్, మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఇదొక‌ ర‌కం. ఇందులో సెక్ష‌న్ 80 సీ కింద‌ ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది కాబ‌ట్టి ఎక్కువ‌మంది ఈ విధ‌మైన పెట్టుబ‌డుల‌కు మొగ్గుచూపుతారు. ఇక‌ సిప్ ద్వారా ఈఎల్ఎస్ఎస్‌లో పెట్టుబ‌డులు ప‌డితే ఎంచుకున్న తేదీన‌ డ‌బ్బు మీ ఖాతా నుంచి సిప్ ఖాతాలో చేరుతుంది. అయితే మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఎలా ఎంచుకుంటారు. ఎలాంటి అంశాల‌ను దృష్టిలో పెట్టుకోవాలంటే…

మ్యూచువ‌ల్ ఫండ్‌ను ఎంచుకోవ‌డం ఎలా?

ఆర్థిక ల‌క్ష్యం:

త‌మ ఆర్థిక ల‌క్ష్యాల‌కోసం మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు చేయాల‌నుకుంటే ముందుగా, మీ ల‌క్ష్యంపై స్ప‌ష్ట‌త క‌లిగి ఉండాలి. పెళ్లి కోసం మూడేళ్ల‌లో డ‌బ్బు పొదుపు చేయానుకుంటున్నారా లేదా ప‌దేళ్లు పెట్టుబ‌డులు చేసి ఎక్కువ రాబడిని పొందాల‌నుకుంటున్నారా, అస‌లు ఎందుకోసం పెట్టుబ‌డులు చేస్తున్నార‌నే విష‌యంపై పూర్తి అవ‌గాహ‌న ఏర్ప‌రుచుకోవాలి.

రిస్క్ ఎంత‌?

మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను పెట్టుబ‌డుల‌ను బ‌ట్టి మూడు ర‌కాలుగా విభ‌జించారు. ఎక్కువ రిస్క్ క‌లిగింది, సాధార‌ణంగా, త‌క్కువ రిస్క్ ఉన్న‌ది. ఇది కూడా పెట్టుబ‌డుదారుల ఇష్టాన్ని బ‌ట్టి ఎంచుకోవ‌చ్చు. మొద‌టిదాంట్లో రిస్క్‌తో పాటు వృద్ధి అధికంగా ఉంటుంది. మ‌దుప‌ర్లు ఇక్క‌డ గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఏంటంటే ఆర్థిక ల‌క్ష్యాలు, రిస్క్‌ను గుర్తుంచుకొని పెట్టుబ‌డులు ప్రారంభించాలి. త‌ర్వాత వారి ల‌క్ష్యాల‌కు త‌గినట్లు ఫండ్ల‌ను ఎంచుకోవాలి. లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్ల గురించి తెలుసుకోవాలి.

వ్య‌య నిష్ప‌త్తి:

మ్యూచువ‌ల్ పండ్ల ఆస్తుల‌ను బ‌ట్టి వాటి నిర్వ‌హ‌ణ‌కు సంస్థ ఎంత తీసుకుంటుందో తెలుసుకోవాలి.

మ్యూచువ‌ల్ ఫండ్ ప‌నితీరు:

మీరు పెట్టుబ‌డి ప‌ట్టాల‌నుకుంటున్న మ్యూచువ‌ల్ ఫండ్ గురించి పూర్తి స‌మాచారం మ్యూచువ‌ల్ సంస్థ లేదా వెబ్‌సైట్ లేదా యాంఫీ ద్వారా తెలుసుకోవ‌చ్చు. ఫండ్ మేనేజ‌ర్ అర్హ‌త‌తో పాటు ఫండ్ సైజ్, ట‌ర్నోవ‌ర్ నిష్ప‌త్తి, ఇత‌ర వివ‌రాలపై స్ప‌ష్ట‌త ఉండాలి. ఫండ్ మేనేజ‌ర్ ఎవ‌రు, అత‌ను ప‌ని చేసే విధానం, ఫండ్ మేనేజ‌ర్ కాల‌ప‌రిమితి, సంస్థ‌తో అత‌నికి ఎన్ని సంవ‌త్స‌రాలు అనుబంధం ఉంద‌నేది తెలుసుకోవ‌డం మంచిది.

ఈఎల్ఎస్ఎస్ ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఎప్పుడు పెట్టుబ‌డి ప్రారంభించాలి?

ఈఎల్ఎస్ఎస్ ద్వారా పెట్టుబ‌డులు పెడితే రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయ ప‌న్ను చ‌ట్టుం సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం ప‌న్నుమిన‌హాయింపు ఉంటుంది. దీనికి మూడేళ్ల లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. 2018-19 సంవ‌త్స‌రం నుంచి లాక్‌-ఇన్ పీరియ‌డ్ త‌ర్వాత ఈఎల్ఎస్ఎస్‌పై ప‌న్ను మిన‌హాయింపు లేదు. రూ.1 లక్ష‌కు మించితే ఎల్‌టీసీజీ ప్ర‌కారం 10 శాతం ట్యాక్స్ ప‌డుతుంది. ఈక్విటీ పెట్టుబ‌డుల‌లో ప‌న్ను మిన‌హాయింపు ల‌భించేది కేవలం ఈఎల్ఎస్ఎస్‌లోనే. దీంతోపాటు ఇత‌ర వాటితో పోలిస్తే లాకిన్‌పీరియ‌డ్ త‌క్కువ‌.

మ్యూచువ‌ల్ ఫండ్ల ద్వారా వ‌చ్చిన రాబ‌డిపై రెండు ర‌కాల ప‌న్ను ఉంటుంది. 1. స్వ‌ల్ప కాలిక క్యాపిట‌ల్ గెయిన్స్ (ఎస్టీసీజీ)లో సంవ‌త్స‌రంకంటే త‌క్కువ‌గా ఉంటుంది. ప‌న్ను 15 శాతం 2. ఎల్‌టీసీజీ ఏడాదికి మించి ఉంటుంది. ఆదాయం రూ.ల‌క్ష మించితే ప‌న్ను రేటు 10 శాతంగా ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కు రూ.9 లక్ష‌లు ఒక వ్య‌క్తి ఈఎల్ఎస్‌లో పెట్టుబ‌డులు పెడితే ప‌న్ను విధానం ఎలా ఉంటుందో ప‌రిశీలించండి…

elsss.jpg​​​​​​​

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని