మ‌దుపునకు అత్యుత్త‌మ కార్పొరేట్ బాండ్ ఫండ్స్ ఏవి!

కార్పొరేట్ బాండ్ ఫండ్‌లు త‌మ కార్ప‌స్‌లో క‌నీసం 80% అత్య‌ధిక రేటింగ్ ఉన్న కార్పొరేట్ బాండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టాల‌నే ఆదేశాన్ని క‌లిగి ఉంటాయి.

Updated : 29 Oct 2021 15:59 IST

కొన్ని కార్పొరేట్ బాండ్ ఫండ్‌లు గ‌త సంవ‌త్స‌రం నుండి ఇప్ప‌టిదాకా మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డిదారుల‌కు స‌గ‌టున మంచి రాబ‌డుల‌నే ఇచ్చాయి. కార్పొరేట్ బాండ్ ఫండ్స్ గ‌త ఏడాదిలో స‌గ‌టున 4.06%  రాబ‌డిని అందించాయి. మీరు 3 నుండి 5 సంవ‌త్స‌రాల మ‌ధ్య కాలానికి పెట్టుబ‌డి పెట్ట‌డానికి డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ స్కీమ్ కోసం చూస్తున్న‌ట్ల‌యితే, మీ పెట్టుబ‌డిపై ఎక్కువ రిస్క్ తీసుకోకూడ‌ద‌నుకుంటే మీరు కార్పొరేట్ బాండ్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం మంచిది. కార్పొరేట్ బాండ్ ఫండ్‌లు క్రెడిట్‌-రిస్క్ ఫండ్‌లు, దీర్ఘ‌కాలిక రుణ ప‌థ‌కాలు, గిల్ట్ ప‌థ‌కాల కంటే త‌క్కువ అస్థిర‌త‌ను, త‌క్కువ న‌ష్టాల‌ను క‌లిగి ఉంటాయ‌ని మ్యూచువ‌ల్ ఫండ్ స‌ల‌హాదారులు చెబుతున్నారు.

సెబీ నిబంధ‌న‌ల ప్ర‌కారం, కార్పొరేట్ బాండ్ ఫండ్‌లు త‌మ కార్ప‌స్‌లో క‌నీసం 80% అత్య‌ధిక రేటింగ్ ఉన్న కార్పొరేట్ బాండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టాల‌నే ఆదేశాన్ని క‌లిగి ఉంటాయి. అంటే ఈ ప‌థ‌కాలు త‌మ కార్ప‌స్‌లో ఎక్కువ భాగం `ఏఏఏ` రేటింగ్ ఉన్న‌ కార్పొరేట్ బాండ్ల‌లో పెట్టుబ‌డి పెడ‌తాయి. ఈ పెట్టుబ‌డి ఆదేశం పెట్టుబ‌డిదారుల‌కు రిస్క్‌ను త‌క్కువ చేస్తుంది. ప్ర‌స్తుత మార్కెట్ ప‌రిస్ధితుల‌లో ఇది మ‌దుపుదారుల‌కు అనుకూలించే విష‌య‌మ‌నే చెప్పాలి.  అత్యున్న‌త రేటింగ్ పొందిన కంపెనీలు త‌క్కువ రేటింగ్ ఇచ్చిన కంపెనీల కంటే న‌మ్మ‌ద‌గిన‌విగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అధిక రేటింగ్ అంటే రాబోయే కొద్ది కాలంలో కంపెనీ రేటింగ్‌లు త‌గ్గ‌వు లేదా వారు త‌మ చెల్లింపుల్లో విఫ‌లం కాక‌పోవ‌చ్చ‌నే సంకేతాలు ఉంటాయి. సాధార‌ణంగా త‌క్కువ రేటింగ్ ఉన్న బాండ్ల‌ను ఎవ‌రూ తీసుకోరు. అయితే కంపెనీల‌తో వ్య‌వ‌హారం కొద్దిగా రిస్క్ ఉంటుంద‌నే చెప్పాలి.

2021లో పెట్టుబ‌డి పెట్ట‌డానికి రేటింగ్ బాగున్న అత్యుత్త‌మ కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌

గ‌మ‌నికః గ‌త ప‌నితీరు భ‌విష్య‌త్తు ప‌నితీరుకు హామి లేదు. కార్పొరేట్ బాండ్‌లు కూడా మార్కెట్ రిస్క్‌ల‌కు లోబ‌డి ఉంటాయి. బాండ్స్‌ తీసుకునేట‌ప్పుడు ఆఫ‌ర్ డాక్యుమెంట్‌ను పూర్తిగా చ‌దివి నిర్ణ‌యించుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని