‘వేదాంతా’లో వాటాపెంపుపై అనిల్‌అగర్వాల్‌ దృష్టి

అనిల్‌ అగర్వాల్‌కు చెందిన  వేదాంతా రిసోర్సెస్‌ భారత్‌లోని వేదాంతా లిమిటెడ్‌లో వాటాలను మరింత పెంచుకోనుంది. దీనిలో మరో 17.51శాతం వాటాలను కొనుగోలుకు అనుమతులు కోరుతూ మంగళవారం ఎక్స్‌ఛేంజిలో ఫైలింగ్‌ దాఖలు చేసింది.

Updated : 17 Mar 2021 18:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంతా రిసోర్సెస్‌ భారత్‌లోని వేదాంతా లిమిటెడ్‌లో వాటాలను మరింత పెంచుకోనుంది. దీనిలో మరో 17.51శాతం వాటాల కొనుగోలుకు అనుమతులు కోరుతూ మంగళవారం ఎక్స్ఛేంజీలో ఫైలింగ్‌ దాఖలు చేసింది. ఒక్కో షేరుకు రూ.235(3.24 డాలర్లు) చెల్లించేందుకు సిద్ధపడింది. గతంలో 10 శాతం వాటాలు కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన రూ.160 కంటే ఈ మొత్తం చాలా ఎక్కువ. ప్రస్తుతం వేదాంతా రిసోర్సెస్‌కు వేదాంత లిమిటెడ్‌లో 55శాతం వాటాలు ఉన్నాయి.

బుధవారం భారతీయ స్టాక్‌మార్కెట్లలో వేదాంత రూ.226.5 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. దీనికంటే తాజా ఆఫర్‌లో పేర్కొన్న రూ.235 స్వల్పమొత్తం ఎక్కువ. ఈ డీల్‌ పూర్తయితే వేదాంతా లిమిటెడ్‌పై అనిల్‌ అగర్వాల్‌కు పూర్తి స్థాయిలో పట్టు వచ్చేస్తుంది. గతంలో వేదాంత లిమిటెడ్‌ను టేకోవర్‌ చేయడానికి అనిల్‌ అగర్వాల్‌ దాఖలు చేసిన బిడ్‌ను వాటాదారులు తిరస్కరించిన విషయం తెలిసిందే. వేదాంతాలోని మొత్తం 651 మిలియన్ల షేర్లను కొనుగోలు చేయాలంటే రూ.15.3 వేల కోట్లను వెచ్చించాలి. తాజా ఆఫర్‌ మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 7 వరకు అందుబాటులో ఉంటుంది.

ఇవీ చదవండి

ఇలా అయితే మీరు కోటీశ్వరులు కాలేరు!
వారసులకు బాధ్యతలు అప్పగిద్దామా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని