బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు రూ.1200కే ఇంజెక్షన్‌

కొవిడ్‌-19 చికిత్స సమయంలో వస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌ నివారణకు వాడే యాంఫోటెరిసిన్‌ బి ఇంజెక్షన్‌ తయారీ నిమిత్తం జెనెటిక్‌ లైఫ్‌సైన్సెస్‌కు ఎఫ్‌డీఏ అనుమతి లభించింది.

Updated : 15 May 2021 07:25 IST

నాగ్‌పూర్‌: కొవిడ్‌-19 చికిత్స సమయంలో వస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌ నివారణకు వాడే యాంఫోటెరిసిన్‌ బి ఇంజెక్షన్‌ తయారీ నిమిత్తం జెనెటిక్‌ లైఫ్‌సైన్సెస్‌కు ఎఫ్‌డీఏ అనుమతి లభించింది. ఎఫ్‌డీఏ అనుమతి కోసం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. కంపెనీ వార్దా ప్లాంట్‌లో వచ్చే 15 రోజుల్లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ ఇంజెక్షన్‌ ఖరీదు రూ.7000గా ఉండటంతో పాటు దేశీయంగా తీవ్ర కొరత నెలకొంది. జెనెటిక్‌ లైఫ్‌సైన్సెస్‌ మాత్రం ఈ ఇంజెక్షన్‌ను రూ.1200కే అందించనుంది. రోజుకు ఈ ప్లాంట్‌లో 20000 ఇంజెక్షన్లు తయారు చేయనున్నారు. ఇప్పటికే ఈ సంస్థ కొవిడ్‌ చికిత్సలో వాడుతున్న రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లనూ తయారు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని