Audi Q7: ఆడీ క్యూ7 బుకింగ్‌లు ప్రారంభం.. కనీసం ఎంత చెల్లించాలంటే?
భారత్‌లో వచ్చే నెల విడుదల కానున్న ఆడీ క్యూ7 బుకింగ్‌లు ప్రారంభించినట్లు కంపెనీ మంగళవారం ప్రకటించింది.....
ఇంటర్నెట్ డెస్క్: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ వచ్చే నెల క్యూ7 ఎస్యూవీ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన బుకింగ్‌లను మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రూ.5 లక్షలు చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఇది ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఆసక్తి ఉన్న వారు ఈ కారును ఆన్లైన్లో లేదా సమీప ఆడీ ఇండియా డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
3.0 లీటర్ వీ6 టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్న ఆడీ క్యూ7లో అధునాతన ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, ఆడీ డ్రైవ్ సెలెక్ట్, క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ వంటి ఫీచర్లను అందిస్తున్నట్లు కంపెనీ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. 360 డిగ్రీల కెమెరా వ్యూ గల పార్క్ అసిస్ట్ ప్లస్, లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి భద్రతాపరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. 4-జోన్ ఏసీ, ఎయిర్ అయొనైజర్, 30 రంగులతో యాంబియెంట్ లైటింగ్, 3డీ సౌండ్ సిస్టం వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.
2021లో భారత్‌లో ఆడీ మొత్తం 9 మోడళ్లను విడుదల చేసింది. ఆ ఏడాది మొత్తం విక్రయాల్లో 101 శాతం వృద్ధి నమోదైంది. సంవత్సరం వ్యవధిలో 3,293 యూనిట్లు విక్రయించారు. విద్యుత్తు కార్ల ప్రవేశంతో విక్రయాలు ఊపందుకున్నాయి. ఆడీ ఈ-ట్రాన్ 50, ఆడీ ఈ-ట్రాన్ 55, ఆడీ ఈ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఆడీ ఈ-ట్రాన్ జీటీ, ఆడీ ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ.. కంపెనీ నుంచి వచ్చిన విద్యుత్తు కార్లివి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే