బడ్జెట్ 2021: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.15,700 కోట్లు..

 ఎమ్ఎస్ఎమ్ఈ రంగానికి  యూనియ‌న్ బ‌డ్జెట్ 2021-22లో రూ .15,700 కోట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ‌ కేటాయించింది.  

Published : 01 Feb 2021 14:56 IST

ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ మాట్లాడుతూ  ఎమ్ఎస్ఎమ్ఈ రంగ అభివృద్ధికై ఈ బడ్జెట్‌లో అనేక‌ చర్యలు తీసుకున్నాం. గత బ‌డ్జెట్‌తో పోలిస్తే రెట్టింపు మొత్తం రూ.15,700 కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు. గ‌త బ‌డ్జెట్‌(2020-21)లో ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.7,572 కోట్లు కేటాయించారు. 

కోవిడ్‌-19 మహమ్మారి ప్ర‌భావం అన్ని రంగాలపై ప‌డింది. అయితే సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు మ‌రింత క‌ఠిన‌మైన ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చింది. లాక్‌డౌన్ కార‌ణంగా  ద్ర‌వ్య, స‌ర‌ఫారా సంక్షోభాల‌తో పాటు కార్మికుల కొర‌త‌, బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డం వంటి ఇబ్బందుల‌ను ఎదుర్కొంది.

లాక్డౌన్ వల్ల కలిగిన‌ ఒత్తిడిని తగ్గించడానికి ఆత్మ నిర్భ‌ర్ భారత్ అభియాన్ ప్యాకేజీ కింద ఎమ్ఎస్ఎమ్ఈల‌ కోసం ప్రభుత్వం రూ. 3 లక్షల కోట్ల ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసిఎల్‌జిఎస్) ను ప్రకటించింది. ఈ పథకం గ‌డువు అక్టోబర్ నెలతో  ముగియ‌గా, న‌వంబరు 2020 వ‌ర‌కు గ‌తంలోనే గ‌డువు పొడిగించారు. అయితే తాజ‌గా ఈ గ‌డువును  మార్చి 21, 2021 వరకు పొడిగించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని