ఇల్లు ఎప్పుడు కొనుగోలు చేయాలి?

పాక్షిక‌ డౌన్ పేమెంట్‌కి నిధుల‌ను స‌మ‌కూర్చుకుని ఇంటిని కొనుగోలు చేస్తే ఈఎమ్ఐ త‌క్కువ‌గా ఉంటుంది

Published : 18 Aug 2021 17:16 IST

గృహం కొనుగోలు చేయ‌డం ఒక భావోద్వేగ నిర్ణయం. అస‌లు ఇంటిని ఎప్పుడు కొనుగోలు చేయాలి?  వీలైనంత త్వ‌ర‌గానా?  కొంత కాలం త‌రువాత కొనుగోలు చేయాలా?  లేదా ఎప్ప‌టికీ కొనుగోలు చేయ‌క పోవ‌డం మంచిదా? అనే విష‌యాల‌పై ఉండే అనుకూల‌త‌ల‌ను, ప్ర‌తికూల‌త‌ల‌ను తెలుసుకుని ఇంటిని కొనుగోలు చేసే నిర్ణ‌యం తీసుకోవాలి. 

త్వ‌ర‌గా ఇంటిని కొనుగోలు చేయ‌డంలో అనుకూల‌త‌లు:
* భ‌ద్ర‌త ఉంటుంది. ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించేందుకు వీల‌వుతుంది. బాగా చ‌దువుకున్న‌వారు, నైపుణ్యం గ‌ల వారు, ఆదాయ‌వృద్దికి అవ‌కాశం ఉన్న వారు ఈ విధానాన్ని ఎంపిక చేసుకోవ‌చ్చు.  
* జీవితం చివ‌రి ద‌శీలో మ‌రో ఆదాయం లేన‌ప్పుడు ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని ఏర్పాటు చేసుకునేందుకు ఇంటిని విక్ర‌యించే కంటే బ్యాంకుల వ‌ద్ద రివ‌ర్స్ త‌న‌ఖా పెట్టి ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి ఏర్ప‌టు చేసుకోవచ్చు. లేదా ఇత‌ర ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌చ్చు.
* ప్రారంభ‌ద‌శ‌లో ఇంటిని కొనుగోలు  చేయ‌డం వ‌ల్ల సొంత ఇంటిలో నివ‌సిస్తున్నామ‌నే సంతృప్తి క‌లుగుతుంది. ఒక‌వేళ కొనుగోళ్ళు ఆల‌స్యం అయితే ఎక్కువ మొత్తం చెల్లించ‌వ‌ల‌సి రావ‌చ్చు. 

త్వ‌ర‌గా ఇంటిని కొనుగోలు చేయ‌డంలో ప్ర‌తికూల‌త‌లు:
* ఇత‌ర ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు స‌రిప‌డ మొత్తాన్ని స‌మ‌కూర్చుకోలేక పోవ‌చ్చు. అంతేకాకుండా ఎక్కువ సంవ‌త్స‌రాలు ప‌నిచేయ వ‌ల‌సి రావ‌చ్చు. రుణ భందంలో చిక్కుకుపోవ‌చ్చు. 
* ఒక వ్య‌క్తి త‌న నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌క‌పోతే  ఉద్యోగ న‌ష్టం లేదా ఆదాయ వృద్ది శాతం త‌గ్గే అవ‌కాశం ఉంది. 
* చాలామంది ఇంటితో బాంధ‌వ్యం ఏర్ప‌ర‌చుకుంటారు.  దీనిని ఒక ఆస్తిగా కాకుండా వార‌స‌త్వంగా బావించి వారి పిల్ల‌ల కోసం (వృద్దాప్యంలో వారిపై శ్ర‌ద్ధ తీసుకుంటార‌నే ఆశ‌తో) వ‌దిలి పెట్టాల‌ని కోరుకుంటారు.  ఇల్లు అనేది అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో విక్ర‌యిస్తేనే దానిని ఒక ఆస్తిగా ప‌రిగ‌ణించాలి. 
* ప్ర‌ణాళికా బద్ధంగా ఇంటిని కొనుగోలు చేయ‌డం అవ‌స‌రం. ఒక న‌గ‌రంలో అభివృద్ది చెందిన ప్రాంతంలో 1000 చ‌ద‌ర‌పు అడుగుల ఫ్లాటు ధ‌ర, న‌గ‌ర శివార్ల‌లో 3000 చ‌ద‌ర‌పు అడుగుల ఫ్లాట్ ధ‌ర కంటే ఎక్కువ‌గా ఉంటుంది. ఉద్యోగం మార‌డం, న‌గ‌రాలు, దేశాలు మార‌డం వంట‌వి మీ స‌మ‌స్య‌ల‌ను క్లిష్ట‌త‌రం చేస్తాయి. అందువ‌ల్ల భావోద్వేగాల‌కు లోన‌యై ఇంటిని కొనుగోలు చేయ‌కూడ‌దు. కొనుగోలు చేసే ముందు ఈ అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవాలి.

కొంత కాలం త‌రువాత ఇంటి కొనుగోలు చేస్తే:
ఉద్యోగం/  జీవితంలో స్థిర‌ప‌డిన త‌రువాత మాత్ర‌మే ఇంటి కొనుగోలు గురించి ఆలోచిస్తే
అనుకూల‌త‌లు:
* పాక్షిక‌ డౌన్ పేమెంట్‌కి నిధుల‌ను స‌మ‌కూర్చుకుని ఇంటిని కొనుగోలు చేస్తే ఈఎమ్ఐ త‌క్కువ‌గా ఉంటుంది. 
* ప్రారంభ పెట్టుబడి అవ‌స‌రాన్ని గుర్తించి స‌రైన స‌మ‌యంలో పెట్టుబ‌డుల‌ను ప్రారంభించాలి.  ల‌క్ష్యాల‌ ఆధారంగా పెట్టుబడి పెట్టడం ఇప్పుడు ఆటో పైలెట్‌గా ఉంది. ఆల‌స్యం కొన్ని సార్లు మంచి ఫ‌లితాల‌ను ఇస్తుంది. 
* ఇల్లు నిర్మించి ఎంతో కాలం కాక‌పోతే దాని విలువ, జీవిత‌కాలం ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యంలో మంచి రివర్స్ మోర్ట‌గేజ్ (ఇంటిని బ్యాంకు వ‌ద్ద త‌న‌ఖా ఉంచి ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితానికి కావ‌ల‌సిన నిధిని పొంద‌డం) విలువ‌ను పొందవచ్చు.

ప్ర‌తికూల‌తలు:
* ధ‌ర‌లు పెరుగుతాయి, వ‌డ్డీ రేట్లు అధికంగా ఉండే అవ‌కాశం ఉంది.
* గృహ రుణం తీసుకుని ఆల‌స్యంగా ఇంటిని కొనుగోలు చేయ‌డం వ‌ల్ల ఎక్కువ రోజులు రుణ బంధంలో చిక్కుకునే అవ‌కాశం ఉంది.
* ఉద్యోగం కోల్పోయే అవ‌కాశం, జీవిత‌కాల వ్యాధుల భ‌యం ఎక్కువ‌గా ఉంటుంది. 

ఎప్ప‌టికీ ఇంటిని కొనుగోలు చేయ‌క‌పోవ‌డంలో అనుకూల‌త‌లు:
* పిల్ల‌ల‌కు మ‌రింత చేరువ‌కావ‌చ్చు. లేదా ప‌ద‌వీవిర‌మ‌ణ స‌మ‌యంలో సొంత గ్రామానికి వెళ్ళ‌చ్చు.(ఇంటిని కొనుగోలు చేయ‌డం కంటే ఇవి చౌక‌గా ఉంటాయి.) అధిక మొత్తాన్ని పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. (కానీ స‌రైన రీతిలో పెట్టాలి)
* తొంద‌ర‌గా ప‌ద‌వీవిర‌మ‌ణ చేసి  ప్ర‌యాణాలు చేసేందుకు ఇష్ట‌ప‌డేవారికి ఇది స‌రిపోతుంది. 

ప్ర‌తికూల‌త‌లు:
* ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యంలో బాగా అభివృద్ది చెందిన న‌గ‌ర భాగంలో ఇంటిలో ఉండ‌లేక‌పోవ‌చ్చు. అలాంటి ప్రాతంలో  నివ‌సించి చివ‌రి ద‌శ‌లో వేరే ప్రాంతంలో మీరు స‌ర్ధుబాటు చేసుకోవ‌డం క‌ష్టం కావ‌చ్చు. 
* ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యంలో ఒక కొత్త ఇంటిలోనికి అద్దెకు వెళ్ళడం కంటే మ‌న‌కు బాగా తెలిసిన వారి మ‌ధ్య‌లో ఉండ‌డం మంచింది. ఒక‌వేళ ఇంటిని కొనుగోలు చేయ‌క‌పోతే ఇది సాధ్యం కాదు. ఇల్లు అనే చివ‌రి రీసార్ట్ ఆస్తి, ఒక‌వేళ సొంత ఇల్లు లేక‌పోతే ఆర్ధికంగా నిల‌బ‌డేందుకు స‌రిప‌డ డ‌బ్బు ఉండాలి.  ఇది అంత సుల‌భం కాదు.

వ్య‌క్తిత్వం ఆధారంగా అన్ని ఎంపిక‌ల‌ను ప‌రిశీలించి ఇంటిని కొనుగోలు చేయాలి.  కొంత మంది ముందుగా ఇల్లు కొనుగోలు చేసేందుకు ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. మిగిలిన ల‌క్ష్యాల గురించి త‌రువాత ఆలోచిస్తారు. మ‌రికొంత మంది అద్దె ఇంటిలో ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఈ అనుకూల‌త‌ల‌ను, ప్ర‌తికూల‌త‌లును దృష్టిలో ఉంచుకుని, ఇతరుల‌పై ఆదార‌ప‌డ‌కుండా మ‌న‌కు ఏమి కావాలో మ‌న‌మే నిర్ణ‌యించుకోవాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని