2022లో `ఐపీఓ`కు బైజుస్‌

భార‌త్‌లో అత్యంత విలువైన స్టార్ట‌ప్‌ బైజుస్‌

Updated : 07 Dec 2021 14:06 IST

భార‌త్‌లో ఆన్‌లైన్ ఎడ్యుకేష‌న్ టెక్నాల‌జీ విజృంభించ‌డంతో బైజుస్‌ ఐపీఓకు వెళ్ల‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తొంది. థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ అని పిల‌వ‌బ‌డే ఆన్‌లైన్ ఎడ్యుకేష‌న్ స్టార్ట‌ప్ బైజూస్‌లో ఫేస్‌బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌, చాన్‌-జుక‌ర్‌బ‌ర్గ్, నాస్ప‌ర్స్ లిమిటెడ్‌, టైగ‌ర్ గ్లోబ‌ల్ మేనేజ్‌మెంట్‌, ప్రైవేట్ ఈక్విటీ దిగ్గ‌జం సిల్వ‌ర్ లేక్ మేనేజ్‌మెంట్‌తో స‌హా ప్ర‌ముఖ ప్ర‌పంచ దిగ్గ‌జాలు, కంపెనీలు పెట్టుబ‌డులు పెట్ట‌డం జ‌రిగింది.

భార‌త్‌లో అత్యంత విలువైన స్టార్ట‌ప్‌, బెంగ‌ళూరు ప్ర‌ధాన కార్యాల‌యం ఉన్న కంపెనీ, ఆన్‌లైన్ ఎడ్యుకేష‌న్ ప్రొవైడ‌ర్ బైజుస్‌, 400 మిలియ‌న్ డాల‌ర్ల నుండి 600 మిలియ‌న్ డాల‌ర్ల మ‌ధ్య స‌మీక‌రించ‌డానికి వ‌చ్చే ఏడాది ఐపీఓకు వెళ్ల‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తొంది. బైజు ర‌వీంద్ర‌న్ నేతృత్వంలోని బైజుస్‌, దాని ప్రారంభ‌ `ఐపీఓ` ప‌త్రాల‌ను వ‌చ్చే ఏడాది 2వ త్రైమాసికంలో దాఖ‌లు చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. నిధుల సేక‌ర‌ణ చ‌ర్చ‌ల్లో మోర్గాన్ స్టాన్లీ, సిటీ గ్రూప్ ఇంక్‌, జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో బ్యాంకులు పాలుపంచుకున్నాయి.

ఈ సంవ‌త్స‌రం భార‌త‌దేశ సాంకేతిక రంగం పెరిగింది, ఐపీఓల ద్వారా నిధుల సేక‌ర‌ణ రికార్డు స్థాయికి చేరుకుంది. వెంచ‌ర్ క్యాపిట‌ల్ సంస్థ‌లు దేశంలో త‌మ పెట్టుబ‌డుల‌ను కూడా పెంచాయి. చైనాలో అక్క‌డి ప్ర‌భుత్వం ఈ ఎడ్ టెక్‌ల‌పై అణ‌చివేత థోర‌ణి కూడా కొంత‌వ‌ర‌కు భార‌త్ మార్కెట్ ఆతిథ్య‌మిచ్చేలా చేసింది. `యూబీఎస్‌` గ్రూప్ `ఏజీ` నుండి 150 మిలియ‌న్ డాల‌ర్లు సేక‌రించిన త‌ర్వాత బైజుస్‌ విలువ 16.5 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరింద‌ని బ్లూమ్‌బ‌ర్గ్ న్యూస్ నివేదిక తెలిపింది. బైజుస్‌  విద్యా సాంకేతిక‌త‌లో గ్లోబ‌ల్ లీడ‌ర్ అయ్యే అవ‌కాశం ఉంది. ప్ర‌త్యేకించి చైనాలో ఇలాంటి స్టార్ట‌ప్‌ల‌పై తీవ్ర‌మైన ఆంక్ష‌ల‌ను విధించాయి. దీంతో ఇది ఇక్క‌డ అధిక స్థాయి పెట్టుబ‌డిదారుల దృష్టిని ఆక‌ర్షించింది. 

బైజుస్ వ్య‌వ‌స్థాప‌కుడు ర‌వీంద్ర‌న్ మాట్లాడుతూ స్టార్ట‌ప్ మార్చి 2022 సంవ‌త్స‌రం ముగిసేనాటికి 1.4 బిలియ‌న్ డాల‌ర్ల ఆదాయాన్ని (20% మార్జిన్‌)తో ల‌క్ష్యంగా పెట్టుకుంద‌న్నారు. భార‌త్‌లోని ప్ర‌ముఖ ఆన్‌లైన్ ప‌రీక్ష‌ల త‌యారీ ప్లాట్‌ఫామ్‌ల‌లో ఒక‌టైన `గ్రేడ‌ప్‌`ను బైజుస్ కొనుగోలు చేసింది. జైజుస్ స్టార్ట‌ప్ ఈ ఏడాది భార‌త్‌లో, అమెరికాలోని కూడా 7 సంస్థ‌ల‌ను కొనుగోలు చేసింది. గ‌త 6 నెల‌ల్లో ఈ కొనుగోళ్ల కోసం 2 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా ఖ‌ర్చు చేసింది. భార‌త్‌లో ఎడ్‌టెక్ ప‌రిశ్ర‌మ‌పై బైజుస్ దాదాపుగా ఆధిప‌త్యం చేస్తుంది. అమెరికాలో ఉన్న డిజిట‌ల్ రీడింగ్ ప్లాట్‌ఫామ్ `ఎపిక్‌`ను 500 మిలియ‌న్ డాల‌ర్లు చెల్లించి కొనుగోలు చేసింది. కోడింగ్ స్టార్ట‌ప్ `వైట్‌హాట్` జూనియ‌ర్ కోసం బైజుస్‌ 300 మిలియ‌న్ డాల‌ర్లు వెచ్చించింది.  కోవిడ్ గ‌రిష్ట స్థాయికి చేరుకున్న‌ప్ప‌టికీ కంపెనీ త‌న ప్లాట్‌ఫామ్‌కు 45 మిలియ‌న్ విద్యార్ధుల‌ను జోడించింది. ఈ జులైలో 100 మిలియ‌న్ల‌కు పైగా విద్యార్ధులు ఈ యాప్‌లో ఉన్నారు. 6.5 మిలియ‌న్ల చెల్లింపు వినియోగ‌దారుల‌ను క‌లిగి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని