కోవిడ్‌-19.. ప్ర‌త్యేక‌ ఆరోగ్య బీమా పాల‌సీలు..

కోవిడ్‌-స్పెసిఫిక్ బీమా పాల‌సీ కోసం చూస్తున్నారా.. అయితే ఈ పాల‌సీల‌ను ప‌రిశీలించండి

Updated : 29 Apr 2021 12:04 IST

కోవిడ్ -19 కోసం ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయకపోతే,  చికిత్సకు సంబంధించిన చాలా ఖర్చులను కవర్ చేసే సమగ్ర ప్రణాళికను ఎంచుకోండి. వివిధ బీమా సంస్థ‌లు అందించే కోవిడ్‌-19 పాల‌సీలు, వాటికి సంబంధించిన వివ‌రాలు, పాల‌సీలో క‌వ‌ర‌య్యే అంశాలు, క‌వ‌ర్ కానీ అంశాలు త‌దిత‌ర విష‌యాల‌ను  ఈ క‌థ‌నంలో చూద్దాం. 

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ (రెలిగేర్ హెల్త్‌)..
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ (రెలిగేర్ హెల్త్) అందించే ఈ కరోనా కవచ్ ప్రణాళిక ప్రామాణిక నష్టపరిహార-ఆధారిత ఆరోగ్య బీమా పాలసీ. సాధారణ ఆరోగ్య బీమా పరిధిలోకి రాని అదనపు- ప్ర‌త్యేకించి కోవిడ్ వైద్య ఖర్చులను క‌వ‌ర్‌చేస్తుంది. 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పాల‌సీని తీసుకోవ‌చ్చు. ఇత‌ర కుటుంబ స‌భ్యుల(జీవిత భాగ‌స్వామి, ఆదారిత పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు, చ‌ట్ట‌ప‌రంగా ఆదార‌ప‌డిన ఇత‌ర‌ స‌భ్యులు)ను అవ‌స‌రాన్ని బ‌ట్టి ఈ పాల‌సీలో చేర‌వ‌చ్చు. 92 శాతానికి పైగా క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్ప‌త్తి ఉన్న ప్లాన్ల‌లో ఇది ఒక‌టి. 8,250పైగా ఆసుప‌త్రుల‌తో బ‌ల‌మైన నెట్‌వ‌ర్క్ ఉంది. 

పాల‌సీలో క‌వ‌ర‌య్యే ఖ‌ర్చులు..
* కోవిడ్ -19 కు సంబంధించిన ఆసుపత్రి ఖర్చులు
* ఆయుష్ సిస్ట‌మ్ ఆఫ్ మెడిసెన్స్ కింద ఇన్‌-పేషెంట్‌ చికిత్స ఖర్చులు
* ప్రీ-హాస్పిటలైజేషన్, పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులు వరుసగా 15, 30 రోజుల వరకు
* ఆసుప‌త్రికి వెళ్లేందుకు రోడ్ అంబులెన్స్ ఖర్చులు రూ. 2,000
* కోవిడ్ -19 కు సంబంధించి ఇంటి వ‌ద్ద ఉండి తీసుకునే చికిత్స ఖర్చులు

పాల‌సీలో క‌వ‌ర్ కానీ ఖ‌ర్చులు..
* వ్యాధి నిర్దార‌ణ కోసం ప్ర‌వేశానికి సంబంధించిన ఖ‌ర్చులు
* చికిత్స కోసం కాకుండా, ముందుగానే బెడ్ రెస్ట్ తీసుకున్న‌ప్పుడు అయ్యే ఖ‌ర్చులు
* వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేయ‌కూడని డైట‌రీ స‌ప్లిమెంట్లు
* డేకేర్‌, ఓపీడీ చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చులు
* భార‌త‌దేశం వెలుప‌ల తీసుకునే చికిత్స‌లు

మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సురెన్స్‌..
మీరు ఎంచుకోగల మరో మంచి పాల‌సీ మ్యాక్స్‌ బుపా కరోనా కవ‌చ్ నష్టపరిహార-ఆధారిత పాల‌సీ. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, అత్తమామలతో సహా స్వీయ, కుటుంబ సభ్యుల కోసం ఈ పాల‌సీని ఎంచుకోవ‌చ్చు. 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు కొనుగోలు చేయవచ్చు. 

త‌ల్లిదండ్రుల‌పై ఆధార‌ప‌డిన 25 సంవ‌త్స‌రాల వ‌య‌సు గ‌ల పిల్ల‌లు కూడా ఈ పాల‌సీలో క‌వ‌ర్ అవుతారు.  ఇద్ద‌రు పెద్ద‌లు, న‌లుగురు పిల్ల‌ల‌ను ఈ పాల‌సీ ద్వారా క‌వ‌ర్ చేయ‌వ‌చ్చు. సహ అనారోగ్యాలు, గృహ సంరక్షణ చికిత్స కూడా క‌వ‌ర‌వుతాయి. ఈ పాల‌సీలో మ‌రో ముఖ్య‌మైన అంశం, ఆసుపత్రి గది అద్దెకు ఎటువంటి స‌బ్‌-లిమిట్ లేదు. 4,500 నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రులతో, దాదాపు 89.50 క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి ఉంది. 

పాల‌సీలో క‌వ‌ర‌య్యే ఖ‌ర్చులు..
* కోవిడ్ -19 కారణంగా ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చులు
* 15 రోజుల ప్రీ-హాస్పిటలైజేషన్, 30 రోజుల పోస్ట్‌- హాస్పిటలైజేషన్ ఖర్చులు
* ఆసుప‌త్రికి వెళ్లేందుకు రోడ్ అంబులెన్స్ ఖర్చులు రూ. 2,000 
* ఆయుష్ సిస్ట‌మ్ ఆఫ్ మెడిసెన్స్ కింద ఇన్‌-పేషెంట్ కేర్‌ చికిత్స ఖర్చులు
* కోవిడ్ -19 కి సంబంధించి 14 రోజుల గృహ సంరక్షణ చికిత్స ఖర్చులు 

పాల‌సీలో క‌వ‌ర్ కానీ ఖ‌ర్చులు..
* వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేయ‌కూడని డైట‌రీ స‌ప్లిమెంట్లు
* భార‌త‌దేశం వెలుప‌ల తీసుకునే చికిత్స‌లు
* విశ్రాంతి, పునరావాసం, ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌ కోసం అయ్యే ఖర్చులు
* వ్యాధి నిర్దార‌ణ కోసం ప్ర‌వేశానికి సంబంధించిన ఖ‌ర్చులు
* డేకేర్‌, ఓపీడీ చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చులు

స్టార్ హెల్త్ ఇన్సురెన్స్‌..
కోవిడ్-స్పెసిఫిక్ నష్టపరిహార-ఆధారిత ప్రణాళిక కోసం చూస్తున్న వారికి స్టార్ హెల్త్ అండ్‌ అలైడ్ ఇన్సురెన్స్‌ అందించే ఈ కరోనా కవచ్ బీమా ప్రణాళిక కూడా అనువైనది. ఇందులో 9,900 కి పైగా నెట‌వ‌ర్క్‌ ఆసుపత్రు ఉన్నాయి. వ్యక్తిగ‌తంగా గానీ, ఫ్లోటర్ ప్రాతిపదికన పాల‌సీ తీసుకోవ‌చ్చు. హామీ మొత్తం, వ్య‌క్తి వ‌య‌సు, కాల‌ప‌రిమితి మొద‌లైన వివ‌రాలు ఇత‌ర కవ‌చ్ పాలసీల మాదిరిగానే ఉంటాయి అయితే, ఈ పాలసీ కింద ప్రయోజనాలను పొందటానికి15 రోజుల వెయిటింగ్ పిరియిడ్‌ ఉంటుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 79 శాతం.

పాల‌సీలో వ‌ర్తించే అంశాలు..
* కోవిడ్ -19 కారణంగా ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చులు
* కోవిడ్ -19 కి సంబంధించి 14 రోజుల గృహ సంరక్షణ చికిత్స ఖర్చులు 
* ఆసుప‌త్రికి వెళ్లేందుకు రోడ్ అంబులెన్స్ ఖర్చులు రూ. 2,000 
* 15 రోజుల ప్రీ-హాస్పిటలైజేషన్, 30 రోజుల పోస్ట్‌- హాస్పిటలైజేషన్ ఖర్చులు

పాల‌సీలో క‌వ‌ర్ కానీ ఖ‌ర్చులు..
* వ్యాధి నిర్దార‌ణ కోసం ప్ర‌వేశానికి సంబంధించిన ఖ‌ర్చులు
* విశ్రాంతి, పునరావాసం, కోసం అయ్యే ఖర్చులు
* డేకేర్‌, ఓపీడీ చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చులు
* పాల‌సీ అమ‌లులోకి వ‌చ్చే కంటే ముందే కోవిడ్‌-19 నిర్ధార‌ణ‌ అయిన‌ప్పుడు
* భార‌త‌దేశం వెలుప‌ల తీసుకునే చికిత్స‌లు

ఎడిల్విజ్‌ హెల్త్ ఇన్సురెన్స్‌.. 
అందుబాటు ధ‌ర‌లో ల‌భించే కరోనా కవాచ్ పాలసీల‌లో ఇది కూడా ఒక‌టి.  కోవిడ్ -19 కారణంగా ఆసుపత్రిలో చేరడం లేదా ఇంటి వ‌ద్ద అయ్యే చికిత్సకు సంబంధించిన వైద్య ఖర్చులను భరిస్తుంది. అన్ని కవచ్ ప్రణాళికల మాదిరిగానే, ఇది ఒక వ్యక్తి, కుటుంబ ఫ్లోటర్ ప్రాతిపదికన లభిస్తుంది. రహదారి అంబులెన్స్ కవర్, ప్రీ-హాస్పిటలైజేషన్, పోస్ట్-హాస్పిటలైజేషన్ కవర్, ఇన్-పేషెంట్ ఆయుష్ ట్రీట్మెంట్ కవర్ సహా అనేక కవరేజ్ ప్రయోజనాలను ఈ ప్రణాళికలో పొందవచ్చు.

పాలసీ ప్రయోజనాలను పొందేందుకు, పాల‌సీదారుడు 15 రోజుల పాటు వేచి ఉండాలి. 85 శాతానికి పైగా క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని ఉన్నప్పటికీ, నెట్‌వర్క్‌లో 3వేల‌ కంటే తక్కువ ఆస్పత్రులు మాత్ర‌మే ఉన్నాయి.

పాల‌సీలో క‌వ‌ర‌య్యే ఖ‌ర్చులు..
* కోవిడ్ -19 కారణంగా క‌నీసం 24 గంట‌ల పాటు ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చులు
* 15 రోజుల ప్రీ-హాస్పిటలైజేషన్, 30 రోజుల పోస్ట్‌- హాస్పిటలైజేషన్ ఖర్చులు
* ఆసుప‌త్రికి వెళ్లేందుకు రోడ్ అంబులెన్స్ ఖర్చులు రూ. 2,000 
* ఆయుష్ సిస్ట‌మ్ ఆఫ్ మెడిసెన్స్ కింద ఆసుప‌త్రి ఖర్చులు
* కోవిడ్ -19 కి సంబంధించి ఇంటి వ‌ద్ద తీసుకునే ట్రీట్‌మెంట్ ఖర్చులు 

పాల‌సీలో క‌వ‌ర్ కానీ ఖ‌ర్చులు..
* భార‌త‌దేశం వెలుప‌ల తీసుకునే చికిత్స‌లు
* డేకేర్‌, ఓపీడీ చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చులు
* పాల‌సీ అమ‌లులోకి వ‌చ్చే కంటే ముందే కోవిడ్‌-19 నిర్ధార‌ణ‌ అయిన‌ప్పుడు చేసే క్లెయిమ్ క‌వ‌ర్ కాదు
* వ్యాధి నిర్దార‌ణ కోసం ప్ర‌వేశానికి సంబంధించిన ఖ‌ర్చులు
* విశ్రాంతి, పునరావాసం, ముంద‌స్తు జాగ్ర‌త్త కోసం చేర‌డం వ‌ల్ల అయ్యే ఖ‌ర్చులు

న్యూ ఇండియా ఎస్యూరెన్స్ హెల్త్ ఇన్సురెన్స్‌..
ఈ కరోనా క‌వ‌చ్, పాలసీ వ్యవధిలో.. పాలసీ తీసుకున్న వ్య‌క్తి ఆసుపత్రిలో చేరేటప్పుడు, కోవిడ్ -19 చికిత్స సమయంలో చేసిన అన్ని వైద్య ఖర్చులను అందిస్తుంది. ఈ పాల‌సీ హాస్పిటలైజేషన్, హోమ్ కేర్ ట్రీట్మెంట్ ఖ‌ర్చులు రెండింటికీ వర్తిస్తుంది. వ్యక్తిగ‌తంగా కానీ, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్రాతిపదికన కానీ తీసుకోవ‌చ్చు. ఈ ప్లాన్ ప్రకారం గరిష్టంగా 10 మందికి కవరేజీని అనుమతిస్తారు.

పాల‌సీలో క‌వ‌ర‌య్యే ఖ‌ర్చులు..
* కోవిడ్ -19 కి సంబంధించి 14 రోజుల గృహ సంరక్షణ చికిత్స ఖర్చులు 
* ఆయుష్ సిస్ట‌మ్ ఆఫ్ మెడిసెన్స్ కింద ఇన్‌-పేషెంట్ కేర్‌ చికిత్స ఖర్చులు
* వ్య‌క్తిగ‌తంగానూ, ఫ్యామిలీ ఫ్లోట‌ర్  రెండింటిలోనూ రూ.5 ల‌క్ష‌ల హామీ మొత్తం ఉంటుంది.
* కోవిడ్ -19 కారణంగా క‌నీసం 24 గంట‌ల పాటు నిరంతరం ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చులు
* 15 రోజుల ప్రీ-హాస్పిటలైజేషన్, 30 రోజుల పోస్ట్‌- హాస్పిటలైజేషన్ ఖర్చులు

పాల‌సీలో క‌వ‌ర్ కానీ ఖ‌ర్చులు..
* భార‌త‌దేశం వెలుప‌ల తీసుకునే చికిత్స‌లు
* వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేయ‌కూడని డైట‌రీ స‌ప్లిమెంట్లు
* డేకేర్‌, ఓపీడీ చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చులు
* ప్ర‌భుత్వ గుర్తింపు లేని డ‌యాగ్న‌స్టిక్ సెంట‌ర్‌లో టెస్ట్  చేయించుకున్న‌ప్పుడు
* పాల‌సీ తీసుకున్న తేది కంటే ముందుగానే నిర్ధార‌ణ అయిన క్లెయిమ్‌లు

బ‌జాబ్ అలియాంజ్ హెల్త్ ఇన్సురెన్స్‌..
ఈ కరోనా కవచ్ పాల‌సీ వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్రాతిపదికన లభిస్తుంది. హెల్త్‌కేర్ కార్మికులు ఈ ప్రణాళికను ఎంచుకుంటే అదనంగా ఐదు శాతం తగ్గింపును పొందుతారు. పాలసీ ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి 15 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉన్న‌ప్ప‌టికీ,  92 శాతం కంటే ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని కలిగి ఉంది. పాలసీదారులు హాస్పిటల్ డైలీ క్యాష్ అనే పేరుతో అందుబాటులో ఉన్న‌ యాడ్-ఆన్ కవర్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇందులో 6,500 కి పైగా నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి.

పాల‌సీలో క‌వ‌ర‌య్యే ఖ‌ర్చులు..
* కోవిడ్ -19 కి సంబంధించి గ‌రిష్టంగా 14 రోజుల గృహ సంరక్షణ చికిత్స ఖర్చులు 
* ఆయుష్ సిస్ట‌మ్ ఆఫ్ మెడిసెన్స్ కింద ఇన్‌-పేషెంట్ కేర్‌ చికిత్స ఖర్చులు
* వ్య‌క్తిగ‌తంగానూ, ఫ్యామిలీ ఫ్లోట‌ర్  హామీ మొత్తం ఎంచుకునే ఆప్ష‌న్ ఉంటుంది.
* 15 రోజుల ప్రీ-హాస్పిటలైజేషన్, 30 రోజుల పోస్ట్‌- హాస్పిటలైజేషన్ ఖర్చులు

పాల‌సీలో క‌వ‌ర్ కానీ ఖ‌ర్చులు..
* భార‌త‌దేశం వెలుప‌ల తీసుకునే చికిత్స‌లు
* వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేయ‌కూడని డైట‌రీ స‌ప్లిమెంట్లు
* డేకేర్‌, ఓపీడీ చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చులు
* టీకాలు లేదా ఇత‌ర నివారాణ చికిత్స‌ల‌కు అయ్యే ఖ‌ర్చులు
* పాల‌సీ తీసుకున్న తేది కంటే ముందుగానే నిర్ధార‌ణ అయిన‌ వ్యాదుల‌కు సంబంధించిన‌ క్లెయిమ్‌లు
 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని