సీపీఐ, డ‌బ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఎలా లెక్కిస్తారు?

రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 6.93 శాతానికి పెరిగింది, అంతకుముందు నెలలో ఇది 6.23 శాతంగా ఉంది...

Published : 24 Dec 2020 16:15 IST

రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 6.93 శాతానికి పెరిగింది, అంతకుముందు నెలలో ఇది 6.23 శాతంగా ఉంది

రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో దాదాపు 7 శాతానికి పెరిగింది, ఇది గృహ వ్యయాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ ఈ సంఖ్య చుట్టూనే అన్ని గ‌ణాంకాలు ఉన్న‌ప్ప‌టికీ సీపీఐ ద్ర‌వ్యోల్బ‌ణం అంటే ఏంటి అది ఎలా లెక్కిస్తారో తెలుసా

సీపీఐ ద్ర‌వ్యోల్బ‌ణం అంటే ఏంటి?
కేంద్ర‌ గణాంకాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 6.93 శాతానికి పెరిగింది, అంతకుముందు నెలలో ఇది 6.23 శాతంగా ఉంది, ఆహార ద్రవ్యోల్బణం జూన్ స్థాయి 8.72 శాతం నుంచి 9.62 శాతానికి పెరిగింది.

ద్రవ్యోల్బణం పెరిగేకొద్ది కాలక్రమేణా ఆర్థిక వ్యవస్థలో వస్తువులు, సేవల ధరల సాధారణ పెరుగుదలగా వర్ణించవచ్చు. నిత్యావసరాల ధరల పెరుగుదలను ట్రాక్ చేయడం ద్వారా దీనిని లెక్కించ‌వ‌చ్చు. నిత్యావసర వస్తువులు, సేవల రిటైల్ ధరల మార్పును గుర్తించే ప్రాథమిక సూచిక వినియోగదారుల ధరల సూచిక లేదా సీపీఐ.

ఇండెక్స్‌లోని వివిధ వస్తువులు, సేవలకు వేర్వేరు ప్ర‌మాణాల ద్వారా వాటి ధరల కదలికను ట్రాక్ చేస్తుంది. ఇది పాన్-ఇండియా స్థాయిలో ధరల కదలికను తెలుపుతుంది. అయితే సీపీఐ జీవన వ్యయ సూచిక కాదు, అందువల్ల వినియోగదారుల వ్యయాల‌ను క‌చ్చితంగా అంచ‌నా వేస్తుంద‌ని చెప్ప‌లేం ఆర్థిక విశ్లేష‌కుల అభిప్రాయం. ఎందుకంటే సీపీఐలో ఆహారం ధ‌ర‌ల వాటా 50 శాతానికి దగ్గరగా ఉంది, కాని చాలా మంది గృహాలు వారి మొత్తం ఖర్చులో దాదాపుగా ఆహారం కోసం ఖర్చు చేయరు. విద్య, ఆరోగ్య సంరక్షణ , రవాణా వంటి సేవలకు మనం ఎక్కువ ఖర్చు చేస్తున్నాం, ఇక్కడ ద్రవ్యోల్బణ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి.

డ‌బ్ల్యూపీఐ అంటే ఏంటి?
ద్రవ్యోల్బణాన్ని కొలిచే ఇతర సూచిక టోకు ధరల సూచిక (డ‌బ్ల్యూపీఐ). రిటైల్ ద్రవ్యోల్బణం వినియోగదారుడు వ‌స్తువుల‌ను కొనుగోలు చేసే ధరను లెక్కిస్తే, టోకు స్థాయిలో ధరల ఆధారంగా డ‌బ్ల్యూపీఐ కొలుస్తారు.

"టోకు ధర, రిటైల్ ధరల మధ్య రెండు తేడాలు ఉన్నాయి, ఒకటి హోల్‌సేల్ నుంచి అమ్మకం వరకు అద‌న‌పు రవాణా ఖర్చు, మరొకటి రిటైల్ స్థాయి ధ‌ర‌. లాక్డౌన్ సమయంలో, ఉదాహరణకు, వస్తువులను రవాణా చేయడం చాలా కష్టం, అదనపు ధర వ్యక్తిగత ధరలకు జోడిస్తారు. అదేవిధంగా, కొరత ఉంటే, రిటైల్ మార్జిన్ పెరుగుతుంది, ధరను పెంచుతుంది.

రెండు సూచికల మధ్య మరొక వ్యత్యాసం ఏమిటంటే, టోకు మార్కెట్ వస్తువుల కోసం మాత్రమే, మీరు టోకు ప్రాతిపదికన సేవలను కొనలేరు. కాబట్టి డ‌బ్ల్యూపీఐ సేవలను కలిగి ఉండదు, అయితే రిటైల్ ధరల సూచిక ఇది లెక్కిస్తుంది. హోల్‌సేల్, రిటైల్ ధరల ప్రమాణాలు కూడా భిన్నంగా ఉంటాయి.

డ‌బ్ల్యూపీఐలో కొన్ని వస్తువులు, ఇంధనం వంటివి కూడా అంతర్జాతీయ ధరలతో ముడిపడి ఉన్నాయి, ఈ సూచిక సీపీఐ గణాంకాల మధ్య అంతరాన్ని సృష్టిస్తుంది. సీపీఐ వినియోగదారునికి వారి సంబంధిత వ‌స్తువుల ధ‌ర‌ల‌ పెరుగుదలను చూపిస్తున్నందున ఇది చాలా సందర్భోచితమైన సూచిక అయితే, ఇది పూర్తిగా వస్తువుల సూచిక కాదు, ఎందుకంటే ఇది కొన్ని వస్తువులు, సేవలపై ఇతరులకన్నా ఎక్కువ దృష్టి పెడుతుంది. ద్రవ్యోల్బణం ప్ర‌భావంతో మీ డబ్బు విలువ కాలక్రమేణా తగ్గుతుంది, కాబట్టి మీ కార్పస్‌ను ద్రవ్యోల్బణం ప్ర‌భావం ప‌డ‌కుండా పెట్టుబ‌డుల‌ను వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని