ట్రాన్స్‌పోర్ట్‌ ఫర్‌ లండన్‌తో టీసీఎస్‌ పదేళ్ల ఒప్పందం

కొత్త స్మార్ట్‌ మొబిలిటీ వ్యవస్థ డిజైన్‌, అమలు, నిర్వహణ కోసం ట్రాన్స్‌పోర్ట్‌ ఫర్‌ లండన్‌ నుంచి పదేళ్ల కాంట్రాక్టు అందుకున్నట్లు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌

Updated : 10 Sep 2021 01:23 IST

దిల్లీ: కొత్త స్మార్ట్‌ మొబిలిటీ వ్యవస్థ డిజైన్‌, అమలు, నిర్వహణ కోసం ట్రాన్స్‌పోర్ట్‌ ఫర్‌ లండన్‌ నుంచి పదేళ్ల కాంట్రాక్టు అందుకున్నట్లు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ప్రకటించింది. ఈ లావాదేవీకి సంబంధించిన ఆర్థిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ పదేళ్ల కాంట్రాక్టును ట్రాన్స్‌పోర్ట్‌ ఫర్‌ లండన్‌ మరో అయిదేళ్లు పొడిగించే అవకాశం కూడా ఉంది. ట్యాక్సీ, ప్రైవేట్‌ అద్దె లైసెన్సులు, నిర్వహణ వంటి వాటిని టీసీఎస్‌ డిజిటల్‌గా మలుస్తుందని, వినూత్నత, మెరుగుదలను కొనసాగించనున్నట్లు తెలిపింది. డిజిటల్‌ మార్పుల కోసం డిజిగవ్‌ నమూనా వినియోగించి కొత్త వ్యవస్థను రూపొందించి తీసుకురానున్నట్లు టీసీఎస్‌ పేర్కొంది. ఇందులో నిర్వహణ వ్యవస్థ డేటా, రికార్డులు కూడా ఉంటాయి. డిజిటల్‌ చానెళ్ల ద్వారా వాహన ఆపరేటర్లు, యాజమానులకు లైసెన్సింగ్‌ చెల్లింపులు, రిఫండ్‌లు వంటి సేవలను సైతం అందించే సౌలభ్యం ఉంటుంది. బ్రిటన్‌లో టీసీఎస్‌కు దాదాపు 18000 మంది ఉద్యోగులు ఉన్నారు.

ఫోర్డ్‌ డీలర్లకు భారీ నష్టం: ఫాడా

ఫోర్డ్‌ ఇండియా భారత్‌లో తయారీ నిలిపివేతకు నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ కంపెనీ డీలర్లు భారీగా నష్టపోతారని వాహన డీలర్ల సంఘం ఫాడా తెలిపింది. విక్రయ కేంద్రాలపై డీలర్లు రూ.2,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారని, 40,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారని పేర్కొంది. ఫోర్డ్‌ నిర్ణయంతో ఇప్పుడు వీటన్నింటిపైనా ప్రభావం పడుతుందని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని