Cabinet meeting: రూ.10,683 కోట్ల పీఎల్‌ఐ పథకానికి మంత్రివర్గం ఆమోదం

కేంద్ర కేబినెట్‌ నేడు ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) స్కీం కింద జౌళి పరిశ్రమలో మనవ తయారీ ఫైబర్‌ దుస్తులు, ఇతర సాంకేతిక ఉత్పత్తులపై వచ్చే ఐదేళ్లలో రూ.10,683 కోట్లను వెచ్చించనుంది.

Updated : 08 Sep 2021 19:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కేంద్ర కేబినెట్‌ నేడు ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) స్కీం కింద జౌళి పరిశ్రమలో మానవ తయారీ ఫైబర్‌ దుస్తులు, ఇతర సాంకేతిక ఉత్పత్తులపై వచ్చే ఐదేళ్లలో రూ.10,683 కోట్లను వెచ్చించనుంది. ఈ పథకం కింద మొత్తం 13 రంగాలను గుర్తించారు. వీటిల్లో కొన్నిటికి ఈ పథకం వర్తింపజేయడానికి కేంద్ర కేబినెట్‌ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలుతో దేశంలో ఉద్యోగాలు పెరగడంతో పాటు పరిశ్రమలు కూడా రానున్నాయి. 

ఈ సారి వస్త్రపరిశ్రమపై దృష్టి సారించింది. మానవ తయారీ ఫైబర్స్‌, టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌ వంటివి దేశీయంగా తయారు కావడం ఈ పరిశ్రమకు చాలా ముఖ్యం. ఇది దేశ దిగుమతులను గణనీయంగా తగ్గిస్తుంది. ‘‘ఈ నిర్ణయంతో కొన్ని ప్రపంచ స్థాయి కంపెనీలు తయారయ్యే అవకాశం ఉంది. ఈ కర్మాగారాలను టైర్‌-3,టైర్‌-4 పట్టణాల్లో ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తాము. ముఖ్యంగా గుజరాత్‌, యూపీ, మహారాష్ట్ర,తమిళనాడు, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ రాష్ట్రాలు లబ్ధిపొందనున్నాయి’’ అని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు.  

ఈ పథకం అమలు చేస్తే ఎంఎంఎఫ్‌, టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ విభాగంలో కొన్ని ప్రపంచ స్థాయి కంపెనీలు తయారవుతాయని కేంద్రం అంచనావేస్తోంది. భవిష్యత్తులో ఈ రంగాలు సాంకేతికంగా, పరిమాణం పరంగా వేగంగా ఎదిగే అవకాశం ఉంది. వీటి ఆధారంగా భారత్‌ కూడా ప్రపంచ స్థాయి టెక్స్‌టైల్‌ రంగంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని