Modi: భారీ స్కీంకు పచ్చజెండా ఊపనున్న మోదీ సర్కారు

దేశీయంగా సెమీకండెక్టర్ల తయారీకి భారత ప్రభుత్వం రూ.76 వేల కోట్లు విలువైన పథకానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రి వర్గం పచ్చజెండా

Updated : 15 Dec 2021 15:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయంగా సెమీకండెక్టర్ల తయారీకి రూ.76 వేల కోట్ల విలువైన పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రి వర్గం పచ్చజెండా ఊపనున్నట్లు సమాచారం. భారత్‌లో సెమీకండెక్టర్ల తయారీకి అవసరమైన వ్యస్థలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పలు రకాల రాయితీలను ఇవ్వనుంది. సెమీకండెక్టర్‌ వేఫర్‌ ఫ్యాబ్రికేషన్‌ యూనిట్‌ ఏర్పాటుకు అయ్యే మూలధన వ్యయంలో 25శాతం వరకు రాయితీ ఇచ్చే అవకాశాలున్నాయి.  అదే విధంగా అసెంబ్లింగ్‌, ప్యాకింగ్‌,టెస్టింగ్‌, చిప్‌ డిజైన్‌ వంటి వాటికి ఇటువంటి రాయితీలనే ప్రకటించవచ్చు.

భారత్‌ను తయారీ హబ్‌గా మార్చేందుకు ప్రకటించిన సెమీకండెక్టర్‌ పాలసీని ఈ నిర్ణయాలు బలోపేతం చేయనున్నాయి. నేడు మంత్రి వర్గ సమావేశంలో ఆమోద ముద్ర లభించాక కేంద్ర ఎలక్ట్రానిక్‌-ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ దీనిలోని ముఖ్యాంశాలను నోటిఫై చేసి కంపెనీలను ఆహ్వానించనుంది. కార్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు ఇలా ప్రతి ఎలక్ట్రానిక్‌ వస్తువు తయారీలోనూ చిప్‌లను వినియోగిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని