Cairn Energy: కెయిర్న్‌ ఎనర్జీ పన్ను వాపస్‌ ప్రక్రియ మొదలు..

భారత్‌ ప్రభుత్వం నుంచి వచ్చి బిలియన్‌ డాలర్లు విలువైన పన్న వాపసు ప్రోసీడ్స్‌ను భవిష్యత్తులో కంపెనీ షేర్ల బైబ్యాక్‌కు వినియోగించనున్నట్లు కెయిర్న్‌ ఎనర్జీ పీఎల్‌సీ పేర్కొంది

Published : 15 Nov 2021 17:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ ప్రభుత్వం నుంచి వచ్చిన బిలియన్‌ డాలర్లు విలువైన పన్ను వాపసు ప్రోసీడ్స్‌ను భవిష్యత్తులో కంపెనీ షేర్ల బైబ్యాక్‌కు వినియోగించనున్నట్లు కెయిర్న్‌ ఎనర్జీ పీఎల్‌సీ పేర్కొంది. భారత్‌ లభించే భారీ పన్ను వాపస్‌తో భారీ ఎత్తున షేర్ల బైబ్యాక్‌ చేయనున్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా 20 మిలియన్‌ డాలర్లతో తొలుత సాధారణ వాటాల కొనుగోలు చేపట్టినట్లు పేర్కొంది. ఈ షేర్ల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలను మోర్గాన్‌ స్టాన్లీ చూసుకొనేట్లు ఒప్పందం కుదుర్చుకొంది. మోర్గాన్స్‌ స్టాన్లీ నుంచి ఈ షేర్లు కెయిర్న్‌కు బదిలీ అవుతాయి. 

2006లో కంపెనీ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణ సమాచారాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వ పన్నుల విభాగం కెయిర్న్‌‌ ఎనర్జీకి నోటీసులు జారీ చేసింది. వాటిని పరిశీలించిన అనంతరం 2015లో రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాలని కోరింది. పునర్‌వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మూలధన రాబడిపై ఈ మేరకు పన్ను చెల్లించాలని తెలిపింది. ఇదిలా ఉండగా.. 2010-11లో కెయిర్న్‌‌ ఎనర్జీ భారత్‌లోని తన అనుబంధ సంస్థ  ‘కెయిర్న్‌‌ ఇండియా’ను వేదాంతకు విక్రయించింది. ఈ క్రమంలో వేదాంతలో ప్రిఫరెన్షియల్‌ షేర్లతో పాటు ఐదు శాతం వాటాలను ఇచ్చారు.

దీంతో వేదాంతలోని ఐదు శాతం కెయిర్న్‌‌ ఎనర్జీ షేర్లను భారత ప్రభుత్వం అటాచ్‌ చేసింది. అలాగే రూ.1,140 కోట్ల డివిడెండ్లు, రూ.1,590 కోట్ల ట్యాక్స్‌ రీఫండ్‌ను నిలిపివేసింది. దీంతో కెయిర్న్‌ న్యాయపోరాటం చేసింది. తీర్పులు ఆ కంపెనీకి అనుకూలంగా వచ్చాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని