ఆర్థిక కార్యదర్శితో కెయిర్న్‌ సీఈఓ భేటీ

రెట్రోస్పెక్టివ్‌ (పాత తేదీల నుంచి విధించే) పన్ను కేసులో భారత ప్రభుత్వంపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టులో విజయం సాధించిన రెండు నెలల తర్వాత, గురువారం ఆర్థిక కార్యదర్శి అజయ్‌ భూషణ్‌

Published : 19 Feb 2021 01:21 IST

దిల్లీ: రెట్రోస్పెక్టివ్‌ (పాత తేదీల నుంచి విధించే) పన్ను కేసులో భారత ప్రభుత్వంపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టులో విజయం సాధించిన రెండు నెలల తర్వాత, గురువారం ఆర్థిక కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే, ఇతర ముఖ్య అధికారులతో కెయిర్న్‌ ఎనర్జీ పీఎల్‌సీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సైమన్‌ ధామ్సన్‌ భేటీ అయ్యారు. సీబీడీటీ ఛైర్మన్‌ పీసీ మోదీ, ఇతర పన్ను అధికారులతో సైతం సైమన్‌ సమావేశమయ్యారు. పన్ను వివాదం త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంపై ఇంతకు మించి మాట్లాడలేనని అన్నారు. కెయిర్న్‌కు అనుకూలం వచ్చిన తీర్పుపై అంతర్జాతీయ కోర్టులో భారత్‌ అప్పీలు చేసుకునే అవకాశం ఉందని భారత వర్గాలు సంకేతాలిచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌ నుంచి 1.4 బిలియన్‌ డాలర్ల పరిహారం కోసం కెయిర్న్‌ వాటాదార్లు కంపెనీ మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ వివాదంపై పరిష్కారం కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కావాలని ధామ్సన్‌ కోరుతూ వస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని