రూ.2,500 కోట్ల సమీకరణలో కెనరా బ్యాంక్‌

కెనరా బ్యాంక్‌ రూ.2,500 కోట్ల సమీకరణ లక్ష్యంతో క్యూఐపీ (అర్హులైన సంస్థాగత మదుపర్లకు వాటాల కేటాయింపు) ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా జారీ చేసే షేర్లకు రూ.155.58ను కనీస

Published : 18 Aug 2021 04:33 IST

క్యూఐపీ కసరత్తు ప్రారంభం

దిల్లీ: కెనరా బ్యాంక్‌ రూ.2,500 కోట్ల సమీకరణ లక్ష్యంతో క్యూఐపీ (అర్హులైన సంస్థాగత మదుపర్లకు వాటాల కేటాయింపు) ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా జారీ చేసే షేర్లకు రూ.155.58ను కనీస ధరగా నిర్ణయించింది. మూలధన ప్రణాళిక ప్రక్రియకు సంబంధించిన కెనరా బ్యాంక్‌ బోర్డు సబ్‌ కమిటీ గురువారం సమావేశాన్ని నిర్వహించి, క్యూఐపీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించిందని ఎక్స్ఛేంజీలకు కెనరా బ్యాంక్‌ తెలియజేసింది. ఆగస్టు 23న బోర్డు సబ్‌కమిటీ సమావేశాన్ని నిర్వహించి.. ఈక్విటీ షేర్ల ఇష్యూ ధరను, క్యూఐబీలకు (అర్హులైన సంస్థాగత బిడ్డర్‌లు) కేటాయించాల్సిన షేర్ల సంఖ్యను నిర్ణయిస్తుందని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని