సెంట్రల్‌ బ్యాంక్‌ లాభం రూ.165 కోట్లు

ప్రభుత్వ రంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2020-21 డిసెంబరు త్రైమాసికంలో రూ.165.41 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

Updated : 10 Feb 2021 08:10 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2020-21 డిసెంబరు త్రైమాసికంలో రూ.165.41 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో బ్యాంక్‌ ఆర్జించిన నికర లాభం రూ.155.32 కోట్లతో పోలిస్తే ఇది 6.5 శాతం ఎక్కువ. మొత్తం ఆదాయం మాత్రం రూ.7,278.29 కోట్ల నుంచి రూ.6,556.98 కోట్లకు పరిమితమైంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 19.99 శాతం (రూ.33,259.59 కోట్ల) నుంచి 16.30 శాతానికి (రూ.29,486.07 కోట్లకు) తగ్గాయి.   నికర ఎన్‌పీఏలు కూడా 9.26 శాతం (రూ.13,568.05 కోట్లు) నుంచి 4.73 శాతానికి (రూ.7,514.65 కోట్లు) తగ్గాయి. మొండి బకాయిలు, ఆకస్మిక నిధికి కేటాయింపులు రూ.1,249.21 కోట్ల నుంచి రూ.743.74 కోట్లకు తగ్గాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని