ఎస్‌బీఐ - పిల్ల‌ల పొదుపు ఖాతాల గురించి తెలుసా?

మీ పిల్ల‌లు భ‌విష్య‌త్తులో ఆర్థికంగా తెలివిగా, పొదుపు అల‌వాట్ల‌ను అల‌వ‌ర‌చుకుని ముందుకు సాగాల‌నుకుంటున్నారా? అయితే మీ పిల్ల‌ల‌కు బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ను ప‌రిచ‌యం చేసేందుకు ఇదే మంచి స‌మ‌యం, దీని వ‌ల్ల వారికి పొదుపు అల‌వాటు కావ‌డం మాత్ర‌మే కాకుండా వారు పెరుగుతున్న కొద్ది కొంత మొత్తాన్ని కూడా స‌మ‌కూర్చుకో గ‌లుగుతారు. ఇది

Published : 16 Dec 2020 20:47 IST

​​​​​​మీ పిల్ల‌లు భ‌విష్య‌త్తులో ఆర్థికంగా తెలివిగా, పొదుపు అల‌వాట్ల‌ను అల‌వ‌ర‌చుకుని ముందుకు సాగాల‌నుకుంటున్నారా? అయితే మీ పిల్ల‌ల‌కు బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ను ప‌రిచ‌యం చేసేందుకు ఇదే మంచి స‌మ‌యం, దీని వ‌ల్ల వారికి పొదుపు అల‌వాటు కావ‌డం మాత్ర‌మే కాకుండా వారు పెరుగుతున్న కొద్ది కొంత మొత్తాన్ని కూడా స‌మ‌కూర్చుకో గ‌లుగుతారు. ఇది వారి విద్య‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. మీ పిల్ల‌ల వ్య‌క్తిగ‌త ఆర్ధిక ప్ర‌పంచాన్ని ప్రారంభించేదుకు “ఎస్‌బీఐ పెహ్లా క‌ద‌మ్‌, పెహ్లి ఉడాన్‌(పీకే, పీయూ)” పేర్ల‌తో పొదుపు ఖ‌తాల‌ను అందిస్తుంది. ఆధునిక బ్యాంకింగ్‌ను ఎస్‌బీఐ అందించే పెహ్లా క‌ద‌మ్‌, పెహ్లి ఉడాన్ పొదుపు ఖాతాల ద్వారా మీ పిల్ల‌ల‌కు ప‌రిచ‌యం చేయండి. దీని వ‌ల్ల‌ వారు భాద్య‌తాయుతంగా ఖ‌ర్చు పెట్ట‌డమే కాకుండా పొదుపు శ‌క్తిని పెంపొందుకుంటారు. ఈ ఖాతాలు మీ పిల్ల‌లను ఆర్ధిక భ‌విష్య‌త్తు కోసం సిద్ధం చేస్తాయి. ఈ ఖాతాలు పిల్ల‌ల నెల‌వారి పాకేట్ మ‌నీని పొదుపు చేసుకునేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి. ఆధునిక బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోని వివిధ ఛాన‌ళ్ళ‌ను పిల్ల‌లు నేర్చుకునేందుకు వీలుగా ఈ పొదుపు ఖాతాల‌కు ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్‌, మోబైల్ బ్యాంకింగ్ స‌దుపాయాల‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఈ రెండు ఖాతాల‌కు రోజు వారి విత్‌డ్రా ప‌రిమితి ఉంటుంది కాబ‌ట్టి మీ పిల్ల‌లు ఖ‌ర్చుచేయ‌డంలో ఆలోచించి అడుగులు వేస్తారు. పెహ్ల క‌ద‌మ్ ఖాతాను మైన‌ర్ అయిన ప్ర‌తి వారు తెర‌వ‌వ‌చ్చు. పిల్ల‌లు, వారి త‌ల్లిదండ్రులు/ గార్డియ‌న్‌తో జాయిటుంగా ఖాతా తెర‌వాలి.

పెహ్లీ ఉడాన్ ఖాతాను 10 సంవ‌త్స‌రాల వ‌య‌సు దాటి, యూనిఫాంగా సంత‌కం చేయ‌గ‌లిగిన పిల్ల‌లు మాత్ర‌మే తెరువ‌వ‌చ్చు. ఈ ఖాతాను మైన‌ర్ పేరుతో మాత్ర‌మే తెరువ‌వ‌చ్చు. మైన‌ర్ స్వ‌యంగా ఆప‌రేట్ చేసుకోవ‌చ్చు. నెల‌వారీ స‌గ‌టు బ్యాలెన్స్ నిర్వ‌హించ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. గరిష్ట బ్యాలెన్స్: రూ. 10 ల‌క్ష‌లు. లావాదేవీల ప‌రిధి - పోటో ఏటీఎమ్‌-క‌మ్‌-డెబిట్‌కార్డుతో షాపింగ్‌, ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్‌కు రూ. 5వేలు, మోబైల్ బ్యాంకింగ్‌కు రూ. 2 వేలు ప‌రిధి ఉంటుంది. ఈ ప‌రిధి రెండు కార్డుల‌కు వ‌ర్తిస్తుంది. ఆటో స్వీప్‌ - క‌నీసం మొత్తం రూ.20 వేల‌పై ఆటో స్విప్ స‌దుపాయం అందుబాటులో ఉంది. స్విప్ క‌నీస మొత్తం రూ.10 వేల‌పై రూ.1000 మ‌ల్టీపుల్తో అనుమ‌తిస్తారు. త‌ల్లితండ్రులు/ గార్డియ‌న్ కోసం ఓఫ‌ర్ డ్రాఫ్ట్‌ - పెహ్లా కదమ్‌ ఖాతాకు మాత్రమే, తల్లిదండ్రులకు / గార్డియన్లకు ఫిక్సెడ్‌ డిపాజిట్లపై ఓవ‌ర్ డ్రాఫ్ట్ ఉంటుంది. దీనికి ఇతర నిబంధనలు,షరతులను వ‌ర్తిస్తాయి. వ‌డ్డీ రేటు - సాధార‌ణ పొదుపు ఖాతా వ‌డ్డీ రేట్లు అమ‌లు ప‌రుస్తారు. త‌ల్లిదండ్రుల కోసం వ్యక్తిగ‌త ప్ర‌మాద బీమా(పీఏఐ) - పెహ్లాక‌ద‌మ్ ఖాతాదారుల త‌ల్లిదండ్రులు కోసం ఇది అందుబాటులో ఉంది. తీసుకోవ‌టం త‌ప్ప‌నిస‌రి కాదు.

చివరి మాట:

దీనితో పాటు హెచ్డీఎఫ్సీ, కోటక్, ఐసీఐసీఐ, సిటీ బ్యాంకు లాంటి బ్యాంకులు కూడా పిల్లల కోసం పొదుపు ఖాతాలు అందిస్తున్నాయి. మీరు ఖాతా ను ఎంచుకునే ముందు వీటిని కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని