Evergrande: ఎవర్‌గ్రాండే షేర్ల ట్రేడింగ్‌ నిలిపివేత.. 51 శాతం వాటా విక్రయం?

తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎవర్‌గ్రాండే సంస్థ రుణదాతలకు చెల్లింపుల కోసం తన ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌ వ్యాపారంలో మెజార్టీ వాటాను విక్రయించేందుకు ముందుకొచ్చింది. ఎవర్‌గ్రాండే ప్రాపర్టీ సర్వీసెస్‌ గ్రూప్‌లోని 51 శాతం వాటాను ఎవర్‌గ్రాండే విక్రయించనుందని చైనా మీడియా తెలిపింది.

Updated : 04 Oct 2021 19:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎవర్‌గ్రాండే సంస్థ రుణదాతలకు చెల్లింపుల కోసం తన ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌ వ్యాపారంలో మెజార్టీ వాటాను విక్రయించేందుకు ముందుకొచ్చింది. ఎవర్‌గ్రాండే ప్రాపర్టీ సర్వీసెస్‌ గ్రూప్‌లోని 51 శాతం వాటాను ఎవర్‌గ్రాండే విక్రయించనుందని చైనా మీడియా తెలిపింది. చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న హాప్సన్‌ డెవలప్‌మెంట్‌ ఈ వాటాను సొంతం చేసుకునేందుకు 5 బిలియన్‌ డాలర్లు చెల్లించనుందని కథనాలు వెలువడుతున్నాయి.

మరోవైపు హాంకాంగ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో ఎవర్‌గ్రాండే షేర్ల ట్రేడింగ్‌ సోమవారం నిలిచిపోయింది. ఎవర్‌గ్రాండే ప్రాపర్టీ గ్రూప్‌ షేర్ల ట్రేడింగ్‌ కూడా ఆగిపోయింది. కంపెనీ షేర్లకు సంబంధించిన అతిపెద్ద లావాదేవీ ప్రకటన నేపథ్యంలో ట్రేడింగ్‌ నిలిపివేయాలని తామే కోరినట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే లావాదేవీ ఏంటన్నది కంపెనీ పేర్కొనలేదు. మరోవైపు హాప్సన్‌ డెవలప్‌మెంట్‌ సైతం ట్రేడింగ్‌ నిలిపివేయాలని హాంకాంగ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీని కోరినట్లు తెలసింది. వాటా కొనుగోలు నిమిత్తమే దీన్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే, అటు హాప్సన్‌ గానీ, ఇటు ఎవర్‌గ్రాండే గానీ వాటా విక్రయంపై స్పందించలేదు.

చైనాకు చెందిన అతిపెద్ద స్థిరాస్తి కంపెనీ అయిన ఎవర్ గ్రాండే సంక్షోభం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 300 బిలియన్‌ డాలర్లను రుణదాతలకు ఆ కంపెనీ చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం వీటిపై వడ్డీ కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గత వారం కంపెనీకి షేర్లను ఓ చైనా బ్యాంక్‌లో తాకట్టు పెట్టి 1.5 బిలియన్‌ డాలర్ల రుణం ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించింది. బాండ్‌ కొనుగోలు చేసిన వారికి ఈ సొమ్ముతో వడ్డీ చెల్లించాలన్నది ఆ కంపెనీ ప్రణాళిక. ఈ క్రమంలోనే తన అనుబంధ సంస్థలోని వాటా విక్రయానికి సంస్థ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని