
Evergrande: డబ్బులు లేవు.. చేతులెత్తేసిన ఎవర్‌గ్రాండ్..!
రెండో గడువు ముగిసినా చెల్లింపులు చేయని రియాల్టీ దిగ్గజం
ఇంటర్నెట్‌డెస్క్: చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండ్ విదేశీ పెట్టుబడిదారులకు వడ్డీ చెల్లించలేకపోయింది. ఈ విధంగా జరగడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఈ సంస్థ బుధవారం నాటికి విదేశీ పెట్టుబడిదారులకు 47.5 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. తమకు ఇంత వరకూ నిధులు అందలేదని బాండ్ కొనుగోలు చేసిన వారు వార్త సంస్థలకు వెల్లడించారు. బాండు కొనుగోలుదారులతో ఎవర్‌గ్రాండ్‌కు ఉన్న ఒప్పందం ప్రకారం మరో 30 రోజుల అదనపు గడువు ఉంటుంది. అప్పటికీ చెల్లించలేకపోతే ఎగవేతదారుగా ప్రకటిస్తారు. గత వారం ఈ సంస్థ విదేశీ పెట్టుబడిదారులకు చెల్లించాల్సిన 83.5 మిలియన్ డాలర్ల వడ్డీ చెల్లింపులు చేయలేదు.
వడ్డీ చెల్లించని విషయంపై ఎవర్‌గ్రాండ్ ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ సంస్థకు మొత్తం 300 బిలియన్ డాలర్ల మేరకు అప్పులు ఉన్నాయి. దేశంలో ఉద్రిక్తతలు చెలరేగుతాయన్న ఆందోళనతో తొలుత చైనాలో అప్పులు చెల్లించేందుకు ప్రాధాన్యమిస్తోంది.
ఎవర్‌గ్రాండ్ కుప్పకూలితే ఇప్పటికే చైనాలో ఖాళీగా ఉన్న 6.5 కోట్ల ఇళ్ల ధరల్లో పతనం మొదలవుతుంది. చైనీయుల సంపదలో చాలా భాగం రియల్ఎస్టేట్ రంగంలో ఉంది. ఫలితంగా చైనీయుల వ్యయాలు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. అంతేకాదు చైనా బాండ్ మార్కెట్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే చైనాకు 92 ట్రిలియన్ డాలర్ల అప్పు ఉంది. ఇది ఆ దేశ జీడీపీతో పోలిస్తే 353 శాతం ఎక్కువ. ఇప్పుడు కీలకమైన రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగిస్తే చైనాకు ఆర్థిక కష్టాలు తప్పవు. చైనాకు ఆర్థిక కష్టాలు వస్తే ఐరోపా దేశాల విలాసవంతమైన వస్తువుల తయారీ పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ రంగాల 50శాతం ఆదాయం చైనా నుంచి వస్తోంది. చైనా వద్ద దాదాపు 1.1 ట్రిలియన్ డాలర్ల అమెరికా బాండ్లు ఉన్నాయి. ఆసియాలో చాలా దేశాలకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. చైనాలో వచ్చే చిన్న ఆర్థిక సంక్షోభం కూడా ఈ దేశాల వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజి మిస్త్రీ కన్నుమూత
-
Movies News
Nambi Narayanan: దేశం కోసం శ్రమిస్తే దేశ ద్రోహిగా మార్చారు.. నంబి నారాయణన్ కథ ఇదీ!
-
Sports News
Rohit Sharma: రోహిత్ ఆరోగ్యంపై సమైరా అప్డేట్.. ముద్దుముద్దు మాటల వీడియో వైరల్
-
General News
Justice Ujjal Bhuyan: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
-
India News
Corona: 2.5 శాతానికి దిగొచ్చిన రోజువారీ పాజిటివిటీ రేటు
-
World News
Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- ఆవిష్కరణలకు అందలం
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- ఔరా... అనేల
- IND vs ENG: బుమ్రాకు అరుదైన అవకాశం?
- Viveka Murder Case: శివశంకర్‌రెడ్డిదే కీలక పాత్ర
- Anand Mahindra: క్వాలిఫికేషన్ అడిగిన నెటిజన్.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా సమాధానం!
- ‘అమ్మఒడి’ ల్యాప్‌టాప్‌లకు మంగళం
- సన్నిహితులకే ‘కిక్కు!’