Clean science: నేడే క్లీన్ సైన్స్ ఐపీఓ
ఒక్కో షేరుకు ధర రూ. 880 - 900గా నిర్ణయించబడింది.
ఇంటర్నెట్ డెస్క్: ఔషధాలు, ఎఫ్ఎంసీజీ రసాయనాలు వంటి క్రియాత్మక, క్లిష్టమైన ప్రత్యేక రసాయనాలను తయారు చేసే `క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ` ఐపీఓ ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. 9న ముగిసే ఈ ఐపీఓ ఇష్యూ ధర ఒక్కో షేరుకు ₹ 880 - ₹900గా నిర్ణయించారు. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)గా ఉండటంతో ఈ పబ్లిక్ ఇష్యూ నుంచి క్లీన్ సైన్సెస్ ఎటువంటి నిధులను అందుకోలేదు. ఈ సంస్థకు కుర్కుంబ్, ఎమ్ఐడీసీ మహారాష్ట్రలో బహుళ ఉత్పాదక సదుపాయాలు ఉన్నాయి. అధిక స్థాయి కచ్చితత్వం, సామర్ధ్యంతో నిర్వహించడానికి అత్యాధునిక ఆటోమేటెడ్ యంత్రాలూ ఉన్నాయి.
ముఖ్య వివరాలు...
ఇష్యూ వ్యవధి: 7 జులై 2021 నుంచి 9 జులై 2021
ధర: ఈక్విటీ షేరుకు ₹880 నుంచి ₹900 వరకు
బిడ్ మొత్తం: 16 షేర్లు, దాని గుణిజాలలో
ముఖ విలువ: వాటాకు ₹1 ఈక్విటీ
లిస్టింగ్: జులై 19 నాటికి స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్టింగ్ చేస్తారు
కొవిడ్ 19 సంక్షోభం ఉన్నప్పటికీ, క్లీన్ సైన్సెస్ 2021 ఆర్ధిక సంవత్సరంలో 22% టాప్‌లైన్ వృద్ధి సాధించింది. ఆదాయం 2019-21 కంటే 9.1% సీఎజీఆర్ పెరిగింది. ఇదే కాలంలో ఈ సంస్థ `ఈబీఐటీడీఏ`, `పీఏటీ సీఎజీఆర్`ను వరుసగా 23.6%, 26.3%గా నమోదు చేసిందని ఏంజెల్ బ్రోకింగ్ తెలిపింది. గ్రే మార్కెట్లో (లిస్ట్ చేయని) కంపెనీ షేర్లు 50% ప్రీమియంతో భారీగా వ్యాపారం చేస్తున్నాయి. కొవిడ్-19 మహమ్మారి తర్వాత భారత ప్రత్యేక రసాయన పరిశ్రమ అతిపెద్ద మార్జిన్ లబ్ధిదారుల్లో ఒకటిగా ఉంటుందని నిపుణుల అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా