మీ పోర్ట్‌ఫోలియోను మ‌రోసారి స‌మీక్షించుకోండి

మీ పోర్ట్‌ఫోలియోను తిరిగి కొత్త‌గా త‌యారు చేసుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల్ని తెలుసుకోండి.....

Published : 19 Dec 2020 10:44 IST

మీ పోర్ట్‌ఫోలియోను తిరిగి కొత్త‌గా త‌యారు చేసుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల్ని తెలుసుకోండి.​​​​​​​

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ఆర్థిక స‌ల‌హాదారుల సూచ‌న‌ల‌తో ఈ రోజుల్లో పెట్టుబ‌డులు ప్రారంభించ‌డం చాలా సుల‌భ‌మైపోయింది. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు పెట్టుబ‌డుదారులు ఈ విష‌యంలో త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అయితే అటువంటి వారు తిరిగి త‌మ పోర్ట్ఫోలియోను స‌వ‌రించుకునేందుకు తెల‌సుకోవాల్సిన 5 విష‌యాలు…

  1. ఆర్థిక ల‌క్ష్యాలు, పెట్టుబ‌డుల పోర్ట్‌ఫోలియో

మీ పోర్ట్‌ఫోలియోను ప్ర‌యోజ‌న‌క‌రంగా చేసుకునేందుకు పెట్టుబ‌డులను ఒక‌సారి స‌మీక్షించుకోవాలి. మీ ఆర్థిక ల‌క్ష్యాలు నెర‌వేరే విధంగా వాటి ప‌నితీరు ఉందో లేదో గ‌మ‌నించాలి. కొన్నిసార్లు స్నేహితులు, మ‌న చుట్టూ ఉన్న‌వారు చెప్పిన ప్ర‌కారం పెట్టుబ‌డులు పెడుతుంటాం. అవి కొన్నిసార్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌ర‌చ‌వ‌చ్చు. గ‌తంలో మంచి లాభాల‌ను తెచ్చిన ఫండ్లు ప్ర‌స్తుతం న‌ష్టాల్లో ఉండొచ్చు. పోర్ట్ఫోలియోను స‌మీక్షించుకోవ‌డం ద్వారా మీ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించ‌వ‌చ్చు.

  1. లాభంలేని పెట్టుబ‌డుల‌ను తొల‌గించండి

పెట్టుబ‌డుల పోర్ట్ఫోలియో ను స‌మీక్షిస్తే ఏ ఫండ్ వ‌ల‌న అయితే మీకు లాభం లేదో దానిని తొల‌గిస్తే పోర్ట్ఫోలియో ల‌క్ష్యం నెర‌వేరుతుంది. 2-3 సంవ‌త్స‌రాల నుంచి ఏ ఫండ్ల తీరు బాగాలేదో వాటిని తొల‌గించి ఇత‌ర వాటిలో పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచిది. మీ పోర్ట్ఫోలియోకి ఎలాంటి న‌ష్టం క‌ల‌గ‌కుండా ఉండేందుకు స‌మీక్ష‌ చేస్తుండాలి. రిస్క్, మార్కెట్ ఒడుదొడుక‌లు, ఆర్థిక ల‌క్ష్యాలు వంటివి దృష్టిలో పెట్టుకొని పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించాలి.

  1. మీ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పోర్ట్ఫోలియోను తిరిగి నిర్మించుకోండి

పోర్ట్ఫోలియోను తిరిగి నిర్మించుకునేట‌ప్పుడు స్వ‌ల్ప‌కాలిక‌ ల‌క్ష్యాలు ప్ర‌యాణాలు, ఎల‌క్ర్టానిక్ వ‌స్తువులు వంటివి కొనుగోలు చేయ‌డం. దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలు ఉన్న‌త విద్య‌, వావాహం వంటి వాటికోసం పెట్టుబ‌డులను స‌మ‌తుల్యం చేసుకోవ‌డం ముఖ్యం. ప్ర‌తిదానికి వేర్వేరు పెట్టుబ‌డి విధానాల‌ను ఎంచుకోవాలి. రిస్క్ తీసుకోవాల‌నుకుంటే ఎక్కువ‌గా లాభాలు ఇచ్చే ఈక్విటీ సంబంధిత ఫండ్ల‌లో, రిస్క్ లేకుండా ఉండే స్వ‌ల్ప కాలిక ల‌క్ష్యాల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పొదుపు చేయాలి. పాత ప‌ద్ధ‌తిలో ఎన్ఎస్‌సీ, పీపీఎఫ్ పెట్టుబ‌డులు కాకుండా ఈక్విటీల పెట్టుబ‌డులు ఎక్కువ రాబ‌డిని ఇస్తాయ‌న్న విష‌యం ఇప్ప‌టికే చాలా సార్లు రుజువైంది.

  1. క్ర‌మానుగ‌తంగా పోర్ట్ ఫోలియో స‌వ‌ర‌ణ‌

త‌గిన పెట్టుబ‌డి సాధ‌నాల్లో పెట్టుబ‌డులు పెట్టిన‌ప్ప‌టికీ మీ పోర్ట్‌ఫోలియోను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించుకోవ‌డం మంచిది. క‌నీసం సంవ‌త్స‌రానికి ఒక‌సారైనా పెట్టుబ‌డుల‌ను గ‌మ‌నించుకోవాలి. అప్పుడు మీ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా మీ పెట్టుబ‌డులు కొన‌సాగుతున్నాయా లేదా చూసుకోవాలి. బెంచ్‌మార్క్‌కి లేదా ఇత‌ర ఫండ్ల‌కు స‌మానంగా మీ ఫండ్లు ప‌నిచేస్తున్నాయా లేదా చూడాలి.

5.త‌ప్పుల నుంచి నేర్చుకోండి

పైన చెప్పిన అన్ని విదానాలు మీ పోర్ట్‌ఫోలియోను స‌వ‌రించుకోవ‌డంలో తోడ్ప‌డ‌తాయి. చేసిన త‌ప్పిదాల్ని తెలుసుకొని భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ రాకుండా జాగ్ర‌త్తగా వ్య‌వ‌హ‌రించాలి. నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు ఆచితూచి అడుగేయాలి. దీంతో ఆర‌గ్య‌క‌ర‌మైన పోర్ట్ఫోలియోను త‌యారు చేసుకోవచ్చు. స్వ‌ల్ప‌కాలిక‌, దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని