మీ ఆదాయం ఎప్పుడు క్ల‌బ్ చేస్తారు?

జీవిత భాగస్వామి లేదా పిల్లల ఆదాయం కొన్ని షరతులకు అనుగుణంగా కుటుంబంలోని ప్రధాన సంపాదన క‌లిగిన వారి‌ ఆదాయంతో కలిసి ఉంటుంది  

Published : 18 Dec 2020 16:52 IST

ఆదాయాన్ని క్లబ్బింగ్ చేయడం అంటే, ఒక వ్యక్తి ఆదాయాన్ని అతని / ఆమె పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ప్రధాన సంపాదన స్థూల మొత్తం ఆదాయంలో చేర్చడం. సాధారణంగా, ఈ క్లబ్బింగ్ నిబంధనలు కుటుంబ సభ్యులలో వర్తిస్తాయి. జీవిత భాగస్వామి, పిల్లల ఆదాయం కుటుంబం లోని ప్రధాన సంపాదనదారుని ఆదాయంతో కలిసి ఉంటుంది.

భార్య‌-భ‌ర్త‌లకు ఆస్తి బ‌దిలీ
ఆస్తి బదిలీ సమయంలో, ఆదాయాన్ని సంపాదించిన సమయంలో అప్ప‌టికే వారికి భార్య‌భ‌ర్త‌ల సంబంధం ఉండాలి. వివాహానికి ముందు ఆస్తి బదిలీ చేస్తే అది ఈ సెక్ష‌న్ ప‌రిధిలోకి రాదు.

ఆస్తి పొందిన జీవిత భాగస్వామి మరణించిన పరిస్థితిలో, ఆదాయం వ‌స్తున్న‌ప్ప‌టికీ అది మరణించిన బదిలీదారుడి వారసుడి లెక్క‌లోకి రాదు. ఎందుకంటే భార్య లేదా భ‌ర్త‌కే ఇది చెందుతుంది.

జీవిత భాగస్వామికి బదిలీ చేసిన‌ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం
ఒక వ్య‌క్తికి ప్ర‌త్య‌క్షంగా లేదా ప‌రోక్షంగా వ‌చ్చే ఆదాయం సెక్ష‌న్ 27(i) కింద లెక్కిస్తారు. వ్యక్తి స్థూల మొత్తం ఆదాయాన్ని లెక్కించడంలో, సెక్షన్ 27 (i) కు లోబడి వచ్చే అన్ని ఆదాయాలు (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) వ‌స్తాయి. ఒక భర్త (ప్రధాన ఆదాయ సంపాదకుడు) ఏదైనా ఆస్తిని తన భార్యకు బదిలీ చేస్తే, అప్పుడు బదిలీ చేసిన‌ ఆస్తి నుంచి వచ్చే ఆదాయాన్ని బదిలీ చేసే వ్యక్తి (భర్త) ఆదాయంలో చేరుస్తారు.

సెక్ష‌న్‌ 64(1)(iv) ఎవ‌రికి వ‌ర్తిస్తుందంటే…

  1. వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారుడికి
  2. ఇంటి ఆస్తి కాకుండా ఇత‌ర ఆస్తుల‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే
  3. ప‌న్నుచెల్లింపుదారుడు భార్యకు లేదా భ‌ర్త‌కు ఆస్తి బ‌దిలీ చేస్తే
  4. ప్ర‌త్య‌క్షంగా లేదా ప‌రోక్షంగా ఆస్తుల‌ను బ‌దిలీ చేయ‌డం
  5. వేరుగా జీవించడానికి ఒక ఒప్పందానికి సంబంధించి కాకుండా ఆస్తి బదిలీ చేసిన‌ప్పుడు.

పైన పేర్కొన్న షరతులు వ‌ర్తిస్తే, బదిలీ చేసిన‌ ఆస్తి నుంచి వచ్చే ఏదైనా ఆదాయం బదిలీ చేసిన‌వారి ఆదాయానికి అనుసంధాన‌మ‌వుతుంది, దీంతో అది వారి ఆదాయంగా పరిగణిస్తారు. ఆస్తి బదిలీ చేయకపోతే అదే ఆదాయానికి సంబంధించి అన్ని మినహాయింపులు మరియు తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు.

సెక్ష‌న్ 64(1)(iv) ఎప్పుడు వ‌ర్తించ‌దు

  1. వివాహానికి ముందే ఆస్తి బ‌దిలీ చేస్తే
  2. మదింపుదారుడు తగిన పరిశీలన కోసం ఆస్తులను బదిలీ చేస్తే
  3. వేరుగా జీవించడానికి ఒక ఒప్పందానికి సంబంధించి మదింపుదారుడు ఆస్తులను బదిలీ చేస్తే
  4. ఆదాయాన్ని సంపాదించిన తేదీన, బదిలీ, బదిలీదారు మధ్య భార్యాభర్తల సంబంధం లేన‌ప్పుడు
  5. భార్య లేదా భ‌ర్త ఇచ్చిన డ‌బ్బుతో సంపాదించిన ఆస్తి

పైన పేర్కొన్న సందర్భాల్లో, బదిలీ చేసిన‌ ఆస్తి నుంచి వ‌చ్చిన‌ ఆదాయాన్ని బ‌దిలీదారుడిదిగా లెక్కించ‌రు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని