21% తగ్గిన కోల్‌ ఇండియా లాభం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కోల్‌ ఇండియా ఏకీకృత ప్రాతిపదికన రూ.3085.39 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.3,923.87 కోట్ల నికర

Published : 12 Feb 2021 00:40 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కోల్‌ ఇండియా ఏకీకృత ప్రాతిపదికన రూ.3085.39 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.3,923.87 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 21 శాతం తక్కువ. మొత్తం ఆదాయం సైతం రూ.24,602.19 కోట్ల నుంచి రూ.24,334.62 కోట్లకు తగ్గింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో కంపెనీ ఉత్పత్తి 156.78 మిలియన్‌ టన్నులకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఉత్పత్తి 147.50 మి.టన్నులుగా నమోదైంది. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో కోల్‌ ఇండియా వాటా 80 శాతం కంటే ఎక్కువగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని