Q2 Results: కోల్గేట్‌-పామోలివ్‌ లాభం రూ.269 కోట్లు

ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ కోల్గేట్‌-పామోలివ్‌ నికర లాభం జులై-సెప్టెంబరు త్రైమాసికంలో 1.83 శాతం తగ్గి 269.17 శాతంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభాలు రూ.274.19గా ఉన్నాయి....

Updated : 25 Oct 2021 17:18 IST

దిల్లీ: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ కోల్గేట్‌-పామోలివ్‌ నికర లాభం జులై-సెప్టెంబరు త్రైమాసికంలో 1.83 శాతం తగ్గి రూ.269.17 నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభాలు రూ.274.19గా ఉన్నాయి. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో 5.19 శాతం వృద్ధి నమోదై రూ.1,343.96 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో వ్యయాలు రూ.998.05 కోట్లకు ఎగబాకాయి. క్రితం ఏడాది ఇవి రూ.924.12 కోట్లుగా ఉన్నాయి. ఇక సోమవారం జరిగిన బోర్డు మీటింగ్‌లో.. ఒక రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.19 మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఈరోజు ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేర్లు 1.95 శాతం పడిపోయి రూ.1,534 వద్ద స్థిరపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని