LPG Price: గుడ్ న్యూస్.. వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై భారీ తగ్గింపు
నూతన సంవత్సర వేళ ఇంధన తయారీ సంస్థలు వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. వాణిజ్య సిలిండర్ ధరపై భారీ తగ్గింపు ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై
దిల్లీ: నూతన సంవత్సర వేళ ఇంధన తయారీ సంస్థలు వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. వాణిజ్య సిలిండర్ ధరపై భారీ తగ్గింపు ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ. 102.50 తగ్గిస్తున్నట్లు తెలిపాయి. ఈ తగ్గింపు నేటి నుంచే అమల్లోకి వస్తున్నట్లు చమురు సంస్థల వర్గాలు వెల్లడించాయి. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.
డిసెంబరు 1న వాణిజ్య సిలిండర్ ధరను రూ.100కు పైగా పెంచడంతో దేశ రాజధారి దిల్లీలో ఈ సిలిండర్ ధర ఏకంగా రూ.2,101కు పెరిగింది. 2012-13 తర్వాత కమర్షియల్ సిలిండర్ రూ.2,200లకు చేరడం మళ్లీ ఇప్పుడే. దీంతో రెస్టారంట్లు, హోటళ్లు, టీ స్టాల్ వ్యాపారులపై అదనపు భారం పడింది. ఇప్పుడు ఆ సిలిండర్ల ధరను తగ్గించడంతో వారికి కొంతమేర ఊరట లభించినట్లయింది. తాజా తగ్గింపుతో దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.1998.50గా ఉంది. అయితే గృహ అవసరాలను వినియోగించే 14.2కేజీలు, 5కేజీలు, 10కేజీల కాంపోజిట్, 5 కేజీల కాంపోజిట్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.
ఇటీవల గృహ అవసరాలకు వినియోగించే సబ్సీడీ వంట గ్యాస్ సిలిండర్ ధరను కూడా భారీగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో 14.2కేజీల సిలిండర్ ధర కూడా రూ.వెయ్యికి చేరువైంది. దిల్లీ, ముంబయిల్లో 14.2 కిలోల సబ్సిడీ వంట గ్యాసు సిలిండర్ ధర రూ.899.50గా ఉండగా.. కోల్‌కతాలో రూ.926 పలుకుతోంది. హైదరాబాద్‌లో రూ.950పైనే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్