కరోనా కట్టడికి చేసే ఖర్చు ఇకపై CSR!

కరోనా నియంత్రణ కార్యకలాపాలకు కార్పొరేట్‌ సంస్థలు చేసే ఖర్చులను కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (CSR) కింద చూపొచ్చని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా సంరక్షణ కోసం ఆరోగ్య.......

Published : 05 May 2021 20:06 IST

దిల్లీ: కరోనా నియంత్రణ కార్యకలాపాలకు కార్పొరేట్‌ సంస్థలు చేసే ఖర్చులను కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (CSR) కింద చూపొచ్చని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా సంరక్షణ కోసం ఆరోగ్య మౌలిక సదుపాయాలను కల్పించడం, మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి, నిల్వ ప్లాంట్ల స్థాపన, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, సిలిండర్లు, ఇతర వైద్య పరికరాల తయారీ, సరఫరా అన్నీ సీఎస్‌ఆర్‌ కిందకు వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.

మరోవైపు కరోనా వైరస్‌పై పోరాడేందుకు తమ వంతు నిధులతో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) ముందుకు రావాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడ ఇటీవల పిలుపునిచ్చారు. అలాగే కరోనా బాధితుల చికిత్స కోసం తాత్కాలిక ఆసుపత్రులు, సంరక్షణా కేంద్రాల ఏర్పాటు కోసం చేసే ఖర్చు చేసే నిధులను సీఎస్‌ఆర్‌ కింద పరిగణిస్తామని గత ఏప్రిల్‌లోనే కేంద్రం తెలిపింది. అలాగే కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి, చికిత్సలో ఉపయోగించే ఔషధాల తయారీ, వీటికి సంబంధించిన పరిశోధన, అభివృద్ధికి వినియోగించే నిధులను సైతం సీఎస్‌ఆర్‌ కింద పరిగణించవచ్చని తొలి వేవ్‌ సమయంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని