Corporate FD: వ‌డ్డీ రేట్లు ఎంతంటే?

అధిక రేటింగ్ ఉన్న కార్పొరేట్ కంపెనీల‌నే ఎఫ్‌డీల‌లో మ‌దుపు చేయ‌డానికి ఎంచుకోవాలి.

Updated : 18 May 2021 13:31 IST

కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు మ‌దుప‌ర్ల‌లో ప్రాచుర్యం పొందాయి. వీరు బ్యాంక్ ఎఫ్‌డీల‌లో ఇచ్చే వ‌డ్డీ రేట్ల కంటే ఎక్కువ వ‌డ్డీనే ఇస్తున్నాయి. అయితే వీటిని న‌మ్మ‌డం ఎలా? మ‌దుప‌ర్ల‌కు స‌కాలంలో డిపాజిట్ల‌ను చెల్లించే సంస్థ‌ల‌కు మంచి సామ‌ర్ధ్యం ఉన్న‌ట్టు తెలిపే `ఏఏ` రేటింగ్‌ను.. రేటింగ్ సంస్థ‌లు ఇస్తున్నాయి.

బ్యాంక్ ఎఫ్‌డీల మాదిరిగానే కార్పొరేట్ ఎఫ్‌డీల‌పై మీరు సంపాదించే వ‌డ్డీపై ఆదాయ‌పు ప‌న్ను విధించ‌బ‌డుతుంది. అయితే కంపెనీ ఎఫ్‌డీల‌ను అంత ఎక్కువ ఎవ‌రూ సిఫార‌సు చేయ‌రు. అధిక రేటింగ్ ఉన్న కార్పొరేట్ కంపెనీల‌నే ఎఫ్‌డీల‌లో మ‌దుపు చేయ‌డానికి ఎంచుకోవాలి. అప్పుడే మ‌న పెట్టుబ‌డిపై రిస్క్‌ త‌గ్గుతుంది. స‌కాలంలో చెల్లింపుకు సంబంధించి భ‌ద్ర‌త స్థాయి బ‌లంగా ఉంద‌ని `ఏఏ` రేటింగ్ సూచిస్తుంది. `ఏఏ` లేదా అంత‌కంటే ఎక్కువ రేట్ చేయ‌బ‌డిన కార్పొరేట్ ఎఫ్‌డీల జాబితా ఇక్క‌డ ఉంది.

శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్ మిన‌హా ఎఫ్‌డీలు జారీచేసే అన్ని కార్పొరేట్ కంపెనీలు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 0.25% అద‌న‌పు వ‌డ్డీ రేటును ఇస్తున్నాయి. అయితే సుంద‌రం హోమ్ ఫైనాన్స్‌, సుంద‌రం ఫైనాన్స్ 0.50%  వ‌డ్డీని అద‌నంగా ఇస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు