నిలిచిపోయిన 6 లక్షల ఇళ్ల నిర్మాణం

దేశ వ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల నిర్మాణం ఆలస్యం కావడం లేదా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితులు కనిపస్తున్నాయని స్థిరాస్తి సేవల సంస్థ ఆన్‌రాక్‌ ప్రోపర్టీ కన్సల్టెన్సీ ఒక నివేదికలో తెలిపింది. 2014కు ముందు...

Published : 03 Aug 2021 02:16 IST

ముంబయి: దేశ వ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల నిర్మాణం ఆలస్యం కావడం లేదా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితులు కనిపస్తున్నాయని స్థిరాస్తి సేవల సంస్థ ఆన్‌రాక్‌ ప్రోపర్టీ కన్సల్టెన్సీ ఒక నివేదికలో తెలిపింది. 2014కు ముందు ప్రారంభమైన దాదాపు 6లక్షలకు పైగా నివాస గృహాలు ఇంకా అందుబాటులోకి రాలేదని పేర్కొంది. వీటి విలువ దాదాపు రూ.5 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది. ఇందులో 1.74 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిగా ఆగిపోయిందని.. వీటి విలువ రూ.1.74 లక్షల కోట్ల వరకూ ఉంటుందని పేర్కొంది. ఇందులో అధిక భాగం రూ.80 లక్షలలోపు విలువ ఉన్నవే. ఈ 6 లక్షల ఇళ్లలో దేశ రాజధాని దిల్లీలోనే 52 శాతం వరకూ నిర్మాణాలకు ఆటంకం ఏర్పడింది. వీటి విలువ రూ.2.49 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. ఇక హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులలో కలిపి 11 శాతం వరకూ ఉన్నాయని సర్వేలో తేలింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇళ్ల నిర్మాణంలో పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదని ఆనరాక్‌ రీసెర్చ్‌ హెడ్‌ ప్రశాంత్‌ థాకూర్‌ తెలిపారు. కొవిడ్‌-19, వివాదాలతో పాటు ఇతర కారణాలూ ఇళ్ల నిర్మాణాన్ని ఆలస్యం చేస్తున్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని