Covid Crisis: భారీగా పెరిగిన ప్రపంచ రుణాలు!

కొవిడ్‌ మహమ్మారి, ఆర్థిక  వ్యవస్థపై దాని ప్రభావం నేపథ్యంలో 2020లో ప్రపంచ రుణాలు 32 ట్రిలియన్‌ డాలర్ల మేర పెరిగి 290.6 ట్రిలియన్ డాలర్లకు చేరిందని మూడీస్‌ వెల్లడించింది. ఆఫ్రికా, కరీబియన్‌ దేశాల్లోని....

Updated : 08 Jun 2021 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ మహమ్మారి, ఆర్థిక  వ్యవస్థపై దాని ప్రభావం నేపథ్యంలో 2020లో ప్రపంచ రుణాలు 32 ట్రిలియన్‌ డాలర్ల మేర పెరిగి 290.6 ట్రిలియన్ డాలర్లకు చేరిందని మూడీస్‌ వెల్లడించింది. ఆఫ్రికా, కరీబియన్‌ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల ఉత్పాదకత వృద్ధి కుంగడం వల్ల ఆయా దేశాల రుణ చెల్లింపు సామర్థ్యంపై తీవ్ర పభావం పడిందని అభిప్రాయపడింది. అలాగే  అభివృద్ధి చెందిన దేశాలకు ఉత్పాదకత, మానవ వనరులపరమైన ఇబ్బందులు.. రుణాలు చెల్లించే సామర్థ్యానికి సవాల్‌గా నిలవనున్నాయన్నారు.

ఇక కొవిడ్‌ సంక్షోభం నుంచి ప్రపంచ దేశాల పునరుత్తేజం గందగోళంగా ఉండనుందని మూడీస్‌ అభిప్రాయపడింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోనుండగా.. పూర్తిగా సేవాధారిత దక్షిణ ఐరోపా దేశాలు వెనుబడనున్నాయని పేర్కొంది. నిరర్థక రుణాలు పెరిగిపోతున్నప్పటికీ.. ఇప్పటికే సరిపడా ఆర్థిక వనరులు సమకూర్చుకున్న బ్యాంకింగ్‌ వ్యవస్థ పటిష్ఠంగా నిలవనుందని అభిప్రాయపడింది. 

మొత్తం రుణాల్లో ప్రభుత్వ వాటా 2020 నాలుగో త్రైమాసికం నాటికి ప్రపంచ జీడీపీలో 105 శాతానికి ఎగబాకిందని పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రభుత్వాల రుణాలు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారని మూడీస్‌ నివేదిక వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని