Berkshire Hathaway: మార్కెట్లు భారీగా పెరిగాయి..: చార్లీ ముంగెర్‌

ప్రస్తుతం మార్కెట్లు వాస్తవిక విలువ కంటే పెరిగిపోయి.. 1990ల నాటి డాట్‌కామ్‌ బూమ్‌ స్థాయిలో దూకుడగా ఉన్నట్లు బెర్క్‌షైర్‌ హాత్వేకు చెందిన చార్లీ ముంగెర్‌ తెలిపారు.

Updated : 03 Dec 2021 19:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం మార్కెట్లు వాస్తవిక విలువ కంటే పెరిగిపోయి.. 1990ల నాటి డాట్‌కామ్‌ బూమ్‌ స్థాయిలో దూకుడుగా ఉన్నట్లు బెర్క్‌షైర్‌ హాత్వేకు చెందిన చార్లీ ముంగెర్‌ తెలిపారు. దిగ్గజ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ వ్యవహారాలన్నీ చార్లీనే చూస్తారన్న విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం సిడ్నిలో  జరిగిన సోహ్న కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నా అంచనా ప్రస్తుతం మార్కెట్లు డాట్‌కామ్‌ బూమ్‌ సమయంలో కన్నా దూకుడుగా ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించారు. 

క్రిప్టో కరెన్సీల విషయమై స్పందిస్తూ అవి ఉనికిలో ఉండకూడదని కోరుకొన్నారు. అంతేకాదు చైనా నిర్ణయాలను ఆయన సమర్థించారు. ‘‘నేను చైనీయులను ఇష్టపడతాను. క్రిప్టోకరెన్సీలను బ్యాన్‌పై  వారు సరైన నిర్ణయం తీసుకొన్నారని భావిస్తున్నాను. మా దేశంలో ఇంగ్లిష్‌ మాట్లాడే జనాలు మాత్రం తప్పుడు నిర్ణయం తీసుకొన్నారు. విపరీతంగా విలువ పెరిగిపోయిన క్రిప్టో కార్యకలాపాల్లో నేను పాల్గొనను’’ అని ముంగెర్‌ తేల్చి చెప్పారు. చైనాతో అమెరికాకు ఉన్న విభేదాలు పరిష్కరించడంలో ఆస్ట్రేలియా వారధి వలే పనిచేయాలని కోరారు. చైనాలో ఆస్ట్రేలియాకు ఉన్న బంధం దీనికి ఉపయోగపడుతుందని ముంగెర్‌ వ్యాఖ్యనించాడు.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని