DRDO: 2-డీజీ ధర ఎంతంటే..?
కరోనా బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) అభివృద్ధి చేసిన 2-డీజీ(2-డియాక్సీ - డి- గ్లూకోజ్) ఔషధం ధర ఖరారైంది. పొడి రూపంలో
ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
దిల్లీ: కరోనా బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) అభివృద్ధి చేసిన 2-డీజీ(2-డియాక్సీ - డి- గ్లూకోజ్) ఔషధం ధర ఖరారైంది. పొడి రూపంలో ఉండే ఈ ఔషధం ఒక్కో సాచెట్ ధర రూ. 990గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం ఫార్మా కంపెనీ డిస్కౌంట్ ధరకు అందజేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఆ డిస్కౌంట్ ఎంత అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
2-డీజీ ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో కలిసి డీఆర్డీవో ఆధ్వర్యంలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్’ (ఇన్మాస్) అభివృద్ధి చేసింది. ఆక్సిజన్ అవసరమైన కొవిడ్ బాధితులు త్వరగా కోలుకునేలా ఈ ఔషధం పనిచేస్తున్నట్లు డీఆర్డీఓ ప్రకటించింది. నీటిలో కలుపుకొని తాగేలా పౌడర్ రూపంలో ఉన్న ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) ఇటీవల అత్యవసర వినియోగ అనుమతిని ఇచ్చింది. ఈ నెల 17న తొలి విడత కింద 10వేల సాచెట్లను, మే 27న రెండో విడత కింద మరో 10వేల సాచెట్లను రెడ్డీస్ ల్యాబ్స్ మార్కెట్లోకి విడుదల చేసింది.
కరోనా కట్టడి కోసం డీఆర్డీవో ఏడాది పాటు శ్రమించి ఈ ఔషధాన్ని తీసుకొచ్చింది. గతంలో దీన్ని క్యాన్సర్ కోసం తయారుచేశారు. శరీరంలో క్యాన్సర్ కణాలకు గ్లూకోజ్ అందకుండా ఈ మందు అడ్డుకుంటుందని అప్పట్లో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే సూత్రాన్ని కొవిడ్‌కు అన్వయించుకుని పరిశోధనలు ప్రారంభించారు. శరీరంలోకి ప్రవేశించిన కొవిడ్ వైరస్ కణాలకు గ్లూకోజ్ అందకపోతే కణ విభజన జరగదని, ఫలితంగా శరీరంలో కరోనా వ్యాప్తి కూడా ఆగుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. కాగా.. ఈ ఔషధానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దీని తయారీకి మరో మూడు, నాలుగు సంస్థలకు అనుమతినివ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Goa: ఆస్తి వివాదం.. గోవాలో ఫ్రెంచ్ నటి నిర్బంధం..!
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్‌వాకర్స్ పోరాటం.. దేనికోసం?
-
India News
SA Bobde: ‘సంస్కృతం ఎందుకు అధికార భాష కాకూడదు..?’ మాజీ సీజేఐ బోబ్డే
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!
-
Politics News
JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!
-
Sports News
IND vs NZ: తొలి టీ20.. సుందర్, సూర్య పోరాడినా.. టీమ్ఇండియాకు తప్పని ఓటమి