పాన్ సంఖ్య‌తో మీ గురించి ఏం తెలుస్తుంది?

పాన్ కార్డ్ సంఖ్య వెనుక‌ ఉన్న సీక్వెన్సింగ్ లాజిక్‌ని అర్థం చేసుకోవడం ద్వారా సంఖ్యను సులభంగా గుర్తుంచుకోవ‌చ్చు

Published : 17 Dec 2020 15:46 IST

మీ పాన్ కార్డ్ నంబ‌ర్ మీకు గుర్తుందా. చాలా మందికి గుర్తుంటుంది. కానీ ఆ నంబ‌ర్ వెనుక ఉన్న అర్థం ఏంటి ఆ ప‌ది సంఖ్య‌లు ఏంటి ఎందుకు మీకు కేటాయించారు అనేది మీకు తెలుసా. పాన్ నంబ‌ర్‌తో ఇత‌రుల‌కు మీ గురించి స‌మాచారం తెలుస్తుంది.

యుటీఐ లేదా ఎన్ఎస్‌డీఎల్ ద్వారా ఒక క్ర‌మంలో పాన్ నంబ‌ర్‌ను వ్య‌క్తుల‌కు, ఆదాయ ప‌న్ను శాఖ జారీ చేస్తుంది. మీ మొబైల్ నంబ‌ర్ మాదిరిగా పాన్ నంబ‌ర్ కంప్యూట‌ర్ జ‌న‌రేటెడ్ నంబ‌ర్ కాదు. దాని వెనుక ప‌ర‌మార్థం ఉంది. పాన్ సంఖ్య 10 అక్ష‌రాల‌ను క‌లిగి ఉంటుంది. అందులో సంఖ్య‌ల‌తో పాటు అక్షరాలు ఉంటాయి. మొద‌టి ఐదు ఆంగ్ల‌ అక్ష‌రాలు, త‌ర్వాత నాలుగు సంఖ్య‌లు, చివ‌రిలో ఒక అక్ష‌రం ఉంటుంది.

ఒక్కోసారి ఇంగ్లీష్ అక్ష‌రం ‘O’ , సున్నా’ 0’ కి మ‌ధ్య వ్య‌త్యాసాన్ని గుర్తుప‌ట్ట‌క‌పోవ‌చ్చు. అయితే మీక సంఖ్య‌ల వెన‌కు ఉన్న అర్థం తెలిస్తే సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు. పాన్‌లో మొద‌టి మూడు అక్ష‌రాలు AAA to ZZZ సిరీస్‌లో ఉంటాయి. నాలుగో అక్ష‌రం ఆదాయ ప‌న్ను శాఖ దృష్టిలో మీరు ఏంటి అనేది చెప్తుంది. అంద‌రు వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారుల‌కు నాలుగో అక్ష‌రం “P” అనే ఉంటుంది.

  • “P” అంటే వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారుడు
  • "C"- ఉంటే కంపెనీ
  • "H" - హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌)
  • “A-” - అంటే వ్య‌క్తులు లేదా సంస్థ‌ల‌ బృందం
  • "B “- వ్య‌క్తుల‌ బృందం
  • "G” - ప్ర‌భుత్వ ఏజెన్సీ
  • "J"- తాత్కాలిక న్యాయ‌వ్య‌వ‌స్థ‌
  • "L" - స్థానిక అధికారిక కేంద్రం
  • "F"- సంస్థ లేదా ప‌రిమిత భాగ‌స్వామ్య సంస్థ‌
  • "T" - ట్ర‌స్ట్‌

ఐదో అక్ష‌రం మీ ఇంటి పేరులోని మొద‌టి అక్ష‌రాన్ని తెలుపుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీ స‌ర్‌నేమ్ Singh ఐదో అక్ష‌రం “S” అవుతుంది. వ్య‌క్తులు కాకుండా ఇత‌రులు అయితే పాన్ కార్డు హోల్డ‌ర్ పేరులోని మొద‌టి అక్ష‌రం ఉంటుంది. ఆ త‌ర్వాత నాలుగు సంఖ్యంలు 0001 నుంచి 9999 మ‌ధ్య‌ ఉంటాయి. చివ‌రి సంఖ్య అక్ష‌రం ఉంటుంది. పాన్ సంఖ్య వెనుక ఉన్న ర‌హ‌స్యం ఏంటో తెలుసుకుంటే సుల‌భంగా గుర్తుంచుకోవ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని