- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
నాటి ఉద్యోగులే.. నేటి ఫ్రీలాన్సర్లు!
కరోనా ప్రభావంతో స్వతంత్ర ఉద్యోగులకు పెరుగుతున్న డిమాండ్
ఇంటర్నెట్ డెస్క్: కరోనా ప్రభావంతో సంస్థల్లో ఉద్యోగాల రూపురేఖలు మారిపోతున్నాయి. ఈ క్రమంలో ఫ్రీలాన్సర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఫ్రీలాన్సర్లు అంటే ఒకరకంగా స్వతంత్ర ఉద్యోగులని చెప్పొచ్చు. ఒక నిర్దేశిక పని కోసం సంస్థలు వారిని నియమించుకుంటాయి. పనికి తగ్గ పారితోషికం చెల్లిస్తాయి. పని పూర్తయితే వారికి కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఒకవేళ మళ్లీ వారి సేవలు అవసరమైతే.. కొత్త ప్రాజెక్టు, కొత్త పారితోషికం.. ఇలాగే సాగుతుంది.
కంపెనీలకూ ఖర్చు కలిసొస్తుంది...
లాక్డౌన్ ప్రభావంతో చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ప్రాజెక్టులు, పనులు తగ్గిపోయి ఉద్యోగుల నిర్వహణ సంస్థలకు భారంగా మారిపోయింది. దీంతో ఉద్యోగులను తొలగించాయి. అవసరమైనప్పుడు సేవలు అందించే వారికి అవకాశం కల్పించేందుకు సిద్ధమయ్యాయి. దీనికి ఫ్రీలాన్స్ ఉద్యోగులు సరిగ్గా సరిపోతారు. పని పూర్తి కాగానే.. మరో పని దొరికే వరకు ఉద్యోగుల నిర్వహణ ఖర్చు పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే సంస్థలు ఫ్రీలాన్సర్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. పైగా కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో వ్యాపారాల్లో ఇంకా కొంత అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో శాశ్వత ఉద్యోగుల కంటే ఫ్రీలాన్సర్లే మేలని భావిస్తున్నాయి కొన్ని సంస్థలు.
నైపుణ్యమే ఆధారం..
కరోనా సమయంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనేక ఏళ్ల పాటు ఒకే రంగంలో పనిచేసి నైపుణ్యం సాధించిన వారిపై సైతం వేటు తప్పలేదు. దీంతో వీరంతా ప్రత్యామ్నాయ ఉపాధి వేటలో భాగంగా ఫ్రీలాన్సర్లుగా మారిపోతున్నారు. వారికున్న నైపుణ్యంతో అవసరమున్న సంస్థలకు సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు.
22 శాతం వృద్ధి..
ప్రముఖ జాబ్ పోర్టల్ ఇండీడ్ గణాంకాల ప్రకారం.. ఫ్రీలాన్సర్ జాబ్ మార్కెట్ 2019-2021 మధ్య 22 శాతం పుంజుకుంది. 2019తో పోలిస్తే గత ఏడాది మే-జూన్ మధ్య సంస్థలు ఫ్రీలాన్సర్లకు ఇచ్చే అవకాశాలు రెండింతలైనట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ సమయంలో చాలా మంది నిరుద్యోగులుగా మారడంతో ఉపాధి కోసం ప్రత్యామ్నాయాల వైపు చూసిన వారి సంఖ్యా గణనీయంగానే పెరిగింది.
ఇద్దరికీ ప్రయోజనం..
పనిచేసే ప్రదేశానికి సంబంధించిన వాతావరణం మారడం, ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు వంటి కారణాలు ఉద్యోగులను ఫ్రీలాన్సింగ్వైపు ఆకర్షిస్తున్న కొన్ని కారణాలు. ఫ్రీలాన్సింగ్ వల్ల ఉత్పాదకత కూడా మెరుగ్గా ఉంటుందని కొన్ని సర్వేలు తేల్చాయి. అయితే పనిపై ఉద్యోగికి ఒకరకమైన ‘ఓనర్షిప్’ ఫీలింగ్ కలుగుతుందని.. ఇది వినూత్న ఆలోచనలకు దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ రంగాల్లోనే డిమాండ్
కంప్యూటర్ ఆధారిత సంస్థల్లో ఫ్రీలాన్సర్లకు భారీ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీ, హెచ్ఆర్ సంస్థలు, ఫైనాన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ వంటి రంగాల్లో ఫ్రీలాన్సర్లకు అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పీహెచ్‌పీ డెవలపర్లు, రిక్రూటర్లు, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, కంటెంట్ రైటర్, డిజిటల్ మార్కెటర్లుగా పనిచేసే వారికి సంస్థలు అధిక మొత్తంలో చెల్లించేందుకు ముందుకు వస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Revanth Reddy: ఏడాది ఓపిక పట్టండి.. కాంగ్రెస్ కార్యకర్తలెవరూ పార్టీ వీడొద్దు: రేవంత్ రెడ్డి
-
World News
Afghanistan: తాలిబన్ల పాలనలో అఫ్గానిస్థాన్.. ఏడాదైనా ఏకాకిగానే..!
-
India News
Indian Army: సియాచిన్‌లో తప్పిపోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత లభ్యమైన మృతదేహం
-
Sports News
Sourav Ganguly: పాక్‌తో మ్యాచ్‌లను ఏనాడూ ప్రత్యేకంగా భావించలేదు: గంగూలీ
-
Movies News
Bollywood Movies: బోల్తా కొడుతున్న బాలీవుడ్ మూవీలు.. కారణం అదేనా?
-
General News
Electric bikes: కుషాయిగూడలో పేలిన రెండు ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు.. భారీగా ఎగసిన మంటలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Bihar: జీవిత ఖైదు అనుభవిస్తున్న నేత.. ఇంట్లో కాలక్షేపం!
- Indian Army: సియాచిన్‌లో తప్పిపోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత లభ్యమైన మృతదేహం
- Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- NTR 31: ‘ఎన్టీఆర్ 31’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. అదేంటంటే?
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- Crime News: బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు హైదరాబాద్ వాసులు మృతి
- Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
- Flight: గర్ల్‌ఫ్రెండ్‌తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
- Anand Mahindra: జెండా ఎగురవేసేందుకు వృద్ధ జంట ప్రయాస.. ఆనంద్ మహీంద్రా ఎమోషనల్ పోస్ట్
- Umran Malik : ఉమ్రాన్ మాలిక్ అరుదైన బౌలర్.. అయితే అలా చేయడం నాకు నచ్చదు!