పోస్టాఫీస్ పీపీఎఫ్ ఖాతాలో ఐపీపీబీ యాప్‌తో డిపాజిట్ చేయండి

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత పోస్టాఫీస్ ఖాతాదారులు క‌నీస బ్యాంకింగ్ లావాదేవీల‌ను సుల‌భంగా చేసుకుంటున్నారు. ఇంత‌కుముందు వినియోగ‌దారులు న‌గ‌దు డిపాజిట్ చేయ‌డం, బ్యాలెన్స్ చ‌క్ చేసుకోవ‌డం, లావాదేవీలు, ఇత‌ర అవ‌స‌రాల కోసం పోస్టాఫీస్‌ను సంప్ర‌దించేవారు . పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్, పీపీఎఫ్‌, సుక‌న్య..

Updated : 01 Jan 2021 19:48 IST

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత పోస్టాఫీస్ ఖాతాదారులు క‌నీస బ్యాంకింగ్ లావాదేవీల‌ను సుల‌భంగా చేసుకుంటున్నారు. ఇంత‌కుముందు వినియోగ‌దారులు న‌గ‌దు డిపాజిట్ చేయ‌డం, బ్యాలెన్స్ చ‌క్ చేసుకోవ‌డం, లావాదేవీలు, ఇత‌ర అవ‌స‌రాల కోసం పోస్టాఫీస్‌ను సంప్ర‌దించేవారు . పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్, పీపీఎఫ్‌, సుక‌న్య స‌మృద్ధి ఖాతా వంటి ప‌థ‌కాల‌ను అందిస్తుంది. ఐపీపీబీ ద్వారా ఈ లావాదేవీల‌ను సుల‌భంగా పూర్తిచేయ‌వ‌చ్చు.

పోస్టాఫీస్ పీపీఎప్ ఖాతాలోకి ఐపీపీబీ ద్వారా న‌గ‌దు ఎలా ట్రాన్స్‌ఫ‌ర్ చేయాలో తెలుసుకుందాం

  1. మొద‌ట మీ బ్యాంకు ఖాతా నుంచి ఐపీపీబీ ఖాతాకు న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేయాలి
  2. ‘DOP services’ కి వెళ్లాలి.
  3. అక్క‌డ మీరు రిక‌రింగ్ డిపాజిట్, పీపీఎఫ్‌, సుక‌న్య స‌మృద్ధి ఖాతా, రిక‌రింగ్ డిపాజిట్‌పై రుణాలు వంటివి మీకు కావ‌ల‌సిన దానిని ఎంచుకోవ‌చ్చు.
  4. పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేయాల‌నుకుంటే పీపీఎఫ్ పై క్లిక్ చేయాలి
  5. పీపీఎఫ్ ఖాతా నంబ‌ర్‌, డీఓపీ క‌స్ట‌మ‌ర్ ఐడీని ఎంట‌ర్ చేయాలి
  6. ఎంత డిపాజిట్ చేయాల‌నుకుంటున్నారో ఎంట‌ర్ చేసి పే ఆప్ష‌న్ పై క్లిక్ చేయాలి
  7. ఐపీపీబీ మొబైల్ యాప్‌తో పేమెంట్ పూర్త‌యిన త‌ర్వాత మీకు స‌మాచారం ఇస్తుంది.
  8. ఇండియా పోస్ట్ అందిస్తున్న ఇత‌ర ప‌థ‌కాల‌ను కూడా ఎంచుకొని ఐపీపీబీ ద్వారా చెల్లించ‌వ‌చ్చు
  9. ఇత‌ర బ్యాంకు ఖాతాల నుంచి ఐపీపీబీకి యాప్ ద్వారా న‌గ‌దు బ‌దిలీ చేసుకోవ‌చ్చు
  10. అదే విధంగా రిక‌రింగ్ డిపాజిట్, సుక‌న్య స‌మృద్ధి ఖాతాలో డిపాజిట్ చేయ‌వ‌చ్చు

ఐపీపీబీ మొబైల్ యాప్‌కి రిజిస్ట‌ర్ చేసుకోవ‌డం ఎలా?

  • ఐపీపీబీ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. కొత్త వినియోగ‌దారులైతే ఒక‌సారి పోస్టాఫీస్ శాఖ‌కు రిజిస్ర్టేష‌న్ కోసం వెళ్లాల్సి ఉంటుంది. ఒక‌సారి డిజిట‌ల్ సేవింగ్స్ ఖాతా ప్రారంభ‌మైతే అన్ని లావాదేవీలు సుల‌భంగా చేసుకోవ‌చ్చు.
  • రిజిస్ట‌ర్ చేసుకున్న వినియోగ‌దారులు యాప్‌లో ఖాతా నంబ‌ర్‌, క‌స్ట‌మ్ ఐడీ, పుట్టిన తేదీ, మొబైల్ నంబ‌ర్ వివ‌రాల‌ను అందించాలి
  • ఓటీపీ వ‌స్తుంది అప్పుడు Mpin సెట్ చేయాలి. ఓటీపీ ఎంట‌ర్ చేయాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు