ఏటీఎమ్‌లో నగదు డిపాజిట్‌ చేద్దాం ఇలా...

బ్యాంకు శాఖ‌కు వెళ్లే శ్ర‌మ త‌ప్పేలా నోట్ల‌ను డిపాజిట్ చేసేందుకు క్యాష్ డిపాజిట్ మెషీన్ల‌ను ఉప‌యోగిద్దాం..

Published : 15 Dec 2020 19:23 IST

కొన్నేళ్ల ముందు నగదు డిపాజిట్‌ చేయాలంటే కచ్చితంగా బ్యాంకుకు వెళ్లాల్సిందే. సాంకేతికత విస్తరించే కొద్దీ కొత్త పద్ధతులు వస్తున్నాయి. బ్యాంకు ఏటీఎమ్‌ నుంచే నగదు డిపాజిట్‌ చేసే సదుపాయాన్ని పలు బ్యాంకులు ప్రవేశపెట్టాయి. కొన్ని బ్యాంకులు ప్రత్యేకంగా క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్లను ప్రవేశపెట్టగా మరికొన్ని బ్యాంకులు కియోస్క్‌లను ప్రవేశపెట్టాయి. ఈ విధానంలో నగదు ఎలా డిపాజిట్‌ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నగదు డిపాజిట్‌ చేసే విధానం

క్యాష్ డిపాజిట్ మెషీన్‌లో న‌గ‌దు డిపాజిట్ చేసేందుకు ఈ ప‌ద్ధతుల‌ను పాటించండి

  • క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్‌లో ఏటీఎమ్‌ను స్వైప్‌ చేయండి
  • భాషను ఎంచుకోండి
  • పిన్‌ ఎంటర్‌ చేయండి
  • నగదు డిపాజిట్‌ను ఎంచుకోండి.
  • నిర్ధారించడంపై క్లిక్‌ చేయండి
  • ఖాతా రకాన్ని(కరెంట్‌ లేదా సేవింగ్స్‌) ఎంచుకోండి
  • మెషీన్‌లో నగదు ఉంచండి.
  • యంత్రం నగదు మొత్తాన్ని ధ్రువీకరించేందకు కొన్ని సెకన్లు పడుతుంది.
  • మెషీన్‌ స్క్రీన్‌పై నగదు విలువ ప్రత్యక్షం అవుతుంది.
  • ప్ర‌త్య‌క్ష‌మైన న‌గ‌దు విలువ‌ను ధ్రువీక‌రించాలి.
  • మీరు మరింత సొమ్మును జమ చేయాలనుకుంటే ‘‘మరింత నగదు జమ చేయండి’’ ఆప్షన్‌ను ఎంచుకోండి.

డిపాజిట్‌ మెషీన్‌ ఇతర సేవలు

పిన్‌ మార్పు

ఏటీఎమ్‌లో లాగానే కార్డు పాస్‌వర్డ్‌(పిన్‌) మార్చుకునేందుకు వీలుంది.

బ్యాలెన్స్‌ విచారణ

ఖాతాలో ఉన్న నగదు వివరాలను తెలుసుకునేందుకు క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్‌లో సైతం నగదు వివరాలను స్క్రీన్‌పై చూడొచ్చు.

మినీ స్టేట్‌మెంట్‌

ఈ సేవను ఉపయోగించుకుని ఖాతాలోని లావాదేవీలను తెలుసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్‌ ద్వారా ఖాతాకు సంబంధించిన చివరి 10 లావాదేవీలను ప్రింట్‌ తీసుకోవచ్చు. నగదు రూపంలో రూ. 100, రూ. 500, రూ. 2000 నోట్లను క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్‌లో అనుమతిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని