Jan Dhan: లక్షన్నర కోట్లు @ జన్‌ధన్‌

జన్‌ధన్‌ పథకం కింద బ్యాంకుల్లో ప్రారంభించిన జన్‌ధన్‌ ఖాతాల్లో డిపాజిట్ల మొత్తం కీలక మైలురాయిని చేరుకుంది. ఏడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ పథకంలో కింద ప్రస్తుతం 44.23 కోట్ల ఖాతాలు ఉండగా.. డిసెంబర్‌ చివరి నాటికి ఆయా ఖాతాల్లో డిపాజిట్ల మొత్తం రూ.1,50,939.36 (లక్షన్నర కోట్లు)కు చేరుకుంది.

Published : 09 Jan 2022 17:31 IST

దిల్లీ: జన్‌ధన్‌ పథకం కింద బ్యాంకుల్లో ప్రారంభించిన జన్‌ధన్‌ ఖాతాల్లో డిపాజిట్ల మొత్తం కీలక మైలురాయిని చేరుకుంది. ఏడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ పథకంలో కింద ప్రస్తుతం 44.23 కోట్ల ఖాతాలు ఉండగా.. డిసెంబర్‌ చివరి నాటికి ఆయా ఖాతాల్లో డిపాజిట్ల మొత్తం రూ.1,50,939.36 (లక్షన్నర కోట్లు)కు చేరుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ఈ వివరాలను వెల్లడించింది.

2014 ఆగస్టు 15న ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రారంభించిన తొలి ఏడాదే 17.90 కోట్లు ఖాతాలు ప్రారంభమయ్యాయి. మొత్తం ఖాతాల్లో 34.9 కోట్ల ఖాతాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోవి కాగా.. 8.05 కోట్ల ఖాతాలు గ్రామీణ బ్యాంకుల్లో ఉన్నాయి. మరో 1.28 కోట్ల ఖాతాలు ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఉన్నాయి. 31.28 కోట్ల జన్‌ధన్‌ ఖాతాదారులకు రూపే కార్డులను జారీ చేశామని ఆర్థిక శాఖ తెలిపింది. మొత్తం జన్‌ధన్‌ ఖాతాల్లో 24.61 కోట్ల ఖాతాలు మహిళల పేరిటే ఉండడం గమనార్హం. మరోవైపు ఎలాంటి నగదూ లేని ఖాతాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇటీవలే ఈ విషయాన్ని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. 2021 డిసెంబర్‌ 8 నాటికి 3.65 కోట్ల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదని కేంద్రం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని