Diesel Price Hike : వరుసగా రెండోరోజూ డీజిల్‌ ధర పెంపు!

దేశంలో డీజిల్‌ ధర వరుసగా రెండో రోజూ పెరిగింది. లీటర్‌ డీజిల్‌పై గరిష్ఠంగా 25 పైసలు పెంచుతున్నట్లు సోమవారం ప్రభుత్వం రంగ చమురు విక్రయ సంస్థలు ప్రకటించాయి.....

Updated : 27 Sep 2021 12:36 IST

దిల్లీ: దేశంలో డీజిల్‌ ధర వరుసగా రెండో రోజూ పెరిగింది. లీటర్‌ డీజిల్‌పై గరిష్ఠంగా 25 పైసలు పెంచుతున్నట్లు సోమవారం ప్రభుత్వం రంగ చమురు విక్రయ సంస్థలు ప్రకటించాయి. గత వారం రోజుల్లో డీజిల్‌ ధరల్ని పెంచడం ఇది మూడోసారి. దీంతో కొన్ని రోజుల క్రితం తగ్గించిన ధరల ప్రయోజనం లేకుండా అందకుండా పోతోంది. పెట్రోల్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. తాజా పెంపుతో లీటర్‌ డీజిల్‌ ధర దిల్లీలో రూ.89.32, ముంబయిలో రూ.96.94కు చేరింది. సెప్టెంబరు 24 తర్వాత లీటర్‌ డీజిల్‌ ధర 70 పైసలు పెరిగింది. దీంతో జులై 18 - సెప్టెంబరు 5 మధ్య లీటర్‌పై రూ.1.25 తగ్గిన ప్రతిఫలం ప్రజలకు కొంతమేర దూరమయ్యింది.

ప్రధాన నగరాల్లో లీటర్‌ డీజిల్‌ పెట్రోల్‌ ధరలు..

నగరం           పెట్రోల్‌(రూ.లలో)        డీజిల్‌(రూ.లలో)

హైదరాబాద్‌           105.42                 97.46

విజయవాడ           107.49                 99.14 

విశాఖపట్నం          107.02                 98.03

దిల్లీ                  101.19                  89.32

ముంబయి           107.26                  96.94

చెన్నై                 98.96                  94.08

బెంగళూరు           104.70                 94.90

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని