అక్ష‌య తృతీయ‌కు బంగారం కొనుగోలు చేయాల‌నుకుంటున్నారా?

కోవిడ్ వేళ‌.. భ‌ద్ర‌త అన్నింటి కంటే ముఖ్యం. అందువ‌ల్ల‌ బ‌య‌ట‌కు వెళ్ళి బంగారం కొనుగోలు చేయ‌డం కంటే డిజిట‌ల్ ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రించ‌డం మంచిది

Updated : 14 May 2021 11:09 IST

అక్ష‌య తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయ‌డం వ‌ల్ల మంచి జ‌రుగుతుంద‌ని చాలా మంది విశ్వ‌సిస్తుంటారు. అందుకే ఈ రోజున ఎంతో.. కొంత బంగారం కొనేందుకు ప్ర‌య‌త్నిస్తారు. గ‌త సంవ‌త్స‌రం కోవిడ్ ఆంక్ష‌ల మ‌ధ్యే అక్ష‌య తృతీయ జ‌రుపుకున్నాము. కోవిడ్ రెండో ద‌శ నేప‌థ్యంలో ఈ ఏడాది కూడా ఆంక్ష‌ల మ‌ధ్య అక్ష‌య తృతీయ జ‌రుపుకోవాల్సిన ప‌రిస్థ‌తి ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ నిబంధ‌న‌లో ఉండ‌డంతో, ఆంక్ష‌ల మ‌ధ్య న‌గ‌ల దుకాణాల‌కు వెళ్ళి,  భౌతిక దూరం పాటిస్తూ బంగారం కొనుగోలు చేయ‌డం అంత సుల‌భం కాదు. అలాగే శ్రేయ‌స్క‌రం కూడా కాదు. అందువ‌ల్ల ఈ పండుగ వేళ బంగారాన్ని కొనుగోలు చేయాల‌నుకునే వారికి, గోల్డ్ పండ్స్‌, గోల్డ్ ఈటీఎఫ్‌, ఇ-గోల్డ్ వంటి ఇత‌ర ఆప్ష‌న్లు అందుబాటులో ఉన్నాయి.  

ట్రాన్సెండ్ కన్సల్టెంట్స్, వెల్త్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కార్తీక్ జావేరీ మాట్లాడుతూ "కోవిడ్ -19 సమయంలో, భారతదేశం డిజిటల్ వైపు వేగంగా అడుగులు వేస్తుంది. కోవిడ్‌-19 నేప‌థ్యంలో మ‌న దేశ ప్ర‌జ‌లు వ‌రుస‌గా రెండోసారి అక్షయ తృతీయను జ‌ర‌పుకుంటున్నారు.  గ‌త సంవ‌త్స‌రం ఇలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ప్పుడు ఎక్కువ మంది డిజిట‌ల్ కొనుగోళ్ల‌కు మ‌గ్గుచూపారు. కొనుగోలు దారులు ఇప్పుడు కూడా డిజిట‌ల్ మార్గాల‌ను ఎంచుకోవ‌డం మంచింది. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ 2021 అక్ష‌య తృతీయను ఆనందంగా జ‌రుపుకునేందుకు డిజిట‌ల్ మార్గాలు స‌హాయ‌ప‌డ‌తాయి." అని అన్నారు. 

సెబీ రిజిస్టర్డ్ టాక్స్ అండ్‌ ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు జితేంద్ర సోలంకి మాట్లాడుతూ, "డిమ్యాట్‌ ఖాతా ఉన్నవారు గోల్డ్ ఈటిఎఫ్‌ల‌ను కొనుగోలు చేయవచ్చు. కానీ డిమ్యాట్‌ ఖాతా లేని వారు మ్యూచువల్ ఫండ్ల ద్వారా డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇటువంటి వారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్‌) విధానం ద్వారా కూడా  గోల్డ్ ఫండ్లు, ఇ-గోల్డ్ కొనుగోలు చేయ‌వ‌చ్చు. గోల్డ్ ఫండ్ల‌లో క‌నీసం రూ. 500 విలువైన బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే ఇ-గోల్డ్‌లో అయితే రూ.1 నుంచి కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. కోవిడ్ -19 భ‌ద్ర‌తా నియ‌మాల‌ను పాటిస్తూ, బడ్జెట్ అనుమతించినంత మేర‌ బంగారాన్ని కొనుగోలు చేసి అక్షయ తృతీయ 2021 ను జరుపుకోవచ్చు.

డిజిట‌ల్ ప‌ద్ద‌తిలో బంగారం కొనుగోలుకు అందుబాటులో ఉన్న మార్గాలు..
1. గోల్డ్ ఈటీఎఫ్ -  డిమ్యాట్ ఖాతా అవ‌స‌రం, సిప్ స‌దుపాయం ఉండ‌దు. 
2. గోల్డ్ ఫండ్లు - డిమ్యాట్ ఖాతా అవ‌స‌రం లేదు, మ్యూచువ‌ల్ ఫండ్ల ద్వారా కొనుగోలు చేయోచ్చు. సిప్ విధానం అనుమ‌తిస్తారు.
3. ఇ - గోల్డ్ - డిమ్యాట్ ఖాతా అవ‌స‌రం లేదు. సిప్ అనుమ‌తిస్తారు. ఒక రూపాయి విలువైన‌ బంగారాన్ని కూడా కొనుగోలు చేయ‌వ‌చ్చు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని