బడ్జెట్‌ సూటిగా..! 

కొవిడ్‌ సమయంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన ఈ రెండు అంశాలే పూర్తిగా ఆక్రమించాయి. వీటిని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. కొన్ని అంశాలు సంక్షిప్తంగా..

Published : 01 Feb 2021 23:14 IST

 ప్రత్యక్షపన్నులు మారలేదు.. కానీ..

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ సమయంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన.. ఈ రెండు అంశాలే పూర్తిగా ఆక్రమించాయి. వీటిని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. కొన్ని అంశాలు సంక్షిప్తంగా..

* పన్నులు మారలేదు..

ఈ బడ్జెట్‌లో పరోక్ష పన్నుల్లో ఎటువంటి మార్పు చేయలేదు. కాకపోతే పన్ను చెల్లింపుదారుల నిబంధనలను కొంత సవరించి తేలిక చేశారు. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ ట్రస్ట్‌ల డివిడెండ్‌ చెల్లింపులపై టీడీఎస్‌ను తొలగించారు.

* సీనియర్‌ సిటిజన్లకు మినహాయింపు..

75 ఏళ్ల వయసు దాటి పింఛను, వడ్డీ ఆదాయం పొందుతున్నవారు రిటర్నులు ఫైలింగ్‌ చేయాల్సిన అవసరం లేదు. చిన్న మొత్తంలో పన్ను చెల్లించేవారి వివాదాలు పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు.

ఫ్యూయల్‌, లిక్కర్‌పై సెస్సు..

పలు వస్తువులపై అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ను విధించారు. వీటిలో ఇంధనం, లిక్కర్‌ కూడా ఉన్నాయి. వినియోగదారుడిపై అంతిమంగా ఎటువంటి భారం లేకుండా చూస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. పెట్రోల్‌పై రూ.2.5, డీజిల్‌పై రూ.4, ఆల్కహాల్‌పై 100శాతం విధిస్తామన్నారు.

వీటిపై కస్టమ్‌ డ్యూటీ పెంపు

రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఎల్‌ఈడీ లైట్లు, మొబైల్‌ ఫోన్లు మరింత ఖరీదుగా మారనున్నాయి. వీటిలో దిగుమతి చేసుకొనే భాగాలపై కస్టమ్స్‌ డ్యూటీని పెంచారు. 

డిపాజిట్‌దారులకు భద్రత..

ఏదైనా బ్యాంకులు డిపాజిట్‌దారులకు చెల్లింపులు చేయలేకపోతే డిపాజిట్‌ బీమా కింద రూ.5 లక్షల వరకు పొందవచ్చు.

ఫేస్‌లెస్‌ రిసొల్యూషన్‌

వ్యక్తి గత పన్ను చెల్లింపుదారుల కోసం ఫేస్‌లెస్‌ రిసొల్యూషన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో పాటు ఆదాయపు పన్ను‌ అప్పిలేట్‌ ట్రైబ్యూనల్‌లో ఫేస్‌లెస్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది.

ఈనామ్‌ల బలోపేతం..

మరో 1000 వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీలను ఈ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌తో అనుసంధానం చేయనున్నారు.

వినియోగంలోకి భూములు..

ప్రభుత్వం నిధుల కోసం ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న భూములను వినియోగంలోకి  తెచ్చి ఆదాయం సృష్టించాలని నిర్ణయించింది. దీనికోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను ఏర్పాటు చేస్తోంది.

భారీగా రుణ సేకరణ..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం ప్రభుత్వం మరో రూ.80 వేల కోట్ల రుణాలను సేకరిస్తోంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.12లక్షల కోట్ల రుణాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. 

రహదారుల కోసం..

ప్రభుత్వం రహదారుల నిర్మాణం కోసం బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.20వేల కోట్లతో డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ను ఏర్పాటు చేయనుంది. 

బ్యాంకుల కోసం 

ప్రభుత్వం బ్యాంకుల కోసం రూ.20వేల కోట్లను మూలధన అవసరాల కోసం కేటాయించారు. దీంతోపాటు చిన్న కంపెనీల నిర్వచనాన్ని 2013 కంపెనీల చట్టం ప్రకారం మార్చాలని నిర్ణయించారు. 

ఇవీ చదవండి
ఈ ఏడాది ఐపీవోకు ఎల్‌ఐసీ..!

పెన్ను, పేపర్ లేకుండా జనాభా లెక్కింపు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు