ATM: దేశంలో ఎన్ని ఏటీఎంలు ఉన్నాయో తెలుసా?

దేశవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబరు నాటికి 2.13 లక్షల ఏటీఎంలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. వీటిలో 47 శాతం గ్రామీ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిపింది....

Published : 06 Dec 2021 16:46 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబరు నాటికి 2.13 లక్షల ఏటీఎంలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. వీటిలో 47 శాతం గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిపింది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకులు 2,13,145 ఏటీఎంలు ఏర్పాటు చేశాయి. వీటితో పాటు బ్యాంకింగేతర సంస్థలు ఏర్పాటు చేసే వైట్‌ లేబుల్‌ ఏటీఎం(డబ్ల్యూఎల్‌ఏ)లు మరో 27,837 ఉన్నాయి. ఏటా 1000 ఏటీఎంలను ఏర్పాటు చేయాలని డబ్ల్యూఎల్‌ఏ ఆపరేటర్లకు లక్ష్యంగా నిర్దేశించారు. వీటిని మెట్రో, అర్బన్‌, సెమీ-అర్బన్‌ ప్రాంతాల్లో 1:2:3 నిష్పత్తిలో పంచాలని ఆదేశించినట్లు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని