Ducati: డుకాటీ నుంచి 2022లో 11 కొత్త బైక్‌లు

ఇటలీకి చెందిన ఖరీదైన బైక్‌ల తయారీ సంస్థ డుకాటీ(Ducati) ఈ ఏడాది భారత మార్కెట్‌లో 11 బైక్‌లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది....

Published : 03 Jan 2022 22:34 IST

దిల్లీ: ఇటలీకి చెందిన ఖరీదైన బైక్‌ల తయారీ సంస్థ డుకాటీ(Ducati) ఈ ఏడాది భారత మార్కెట్‌లో 11 బైక్‌లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. వీటిలో స్క్రాంబ్లర్‌ 800 అర్బన్‌ మోటార్డ్‌, స్ట్రీట్‌ఫైటర్‌ వీ2, మల్టీస్ట్రాడా వీ2, మల్టీస్ట్రాడా వీ4 పైక్స్‌ పీక్‌, స్ట్రీట్‌ఫైటర్‌ వీ4 ఎస్‌పీ, ఎంవై22 పనిగేల్‌ వీ4 ఉన్నట్లు వెల్లడించింది. 

ముందుగా హామీ ఇచ్చినట్లు 2021లో 15 కొత్త బైక్‌లను భారత్‌కు తీసుకొచ్చినట్లు డుకాటీ ఇండియా ఎండీ విపుల్‌ చంద్ర తెలిపారు. ఆటో రంగం తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ తమ హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 2021 మూడో త్రైమాసికంలో డుకాటీకి మంచి ఫలితాలు వచ్చినట్లు పేర్కొన్నారు. 2020తో పోలిస్తే మూడు శాతం, 2019తో పోలిస్తే 19 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. 

స్క్రాంబ్లర్‌ 1100 ట్రిబ్యూట్‌ ప్రోతో 2022లో కొత్త బైక్‌ల విడుదలను ప్రారంభించనున్నట్లు డుకాటీ తెలిపింది. తర్వాత పనిగేల్‌ వీ2 బేలిస్‌ ఎడిషన్‌, 996ఆర్‌ స్ఫూర్తితో తయారు చేసిన లివరీని విడుదల చేయనున్నట్లు పేర్కొంది. తర్వాతి త్రైమాసికంలో మల్టీస్ట్రాడా వీ4 పైక్స్‌ పీక్‌తో ప్రారంభిస్తామని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని