ఈఎల్ఎస్ఎస్‌తో ప‌న్ను ఆదాతో పాటు సంపద సృష్టి

సంపదను సృష్టించడానికి ఉత్తమ మ్యూచువల్ ఫండ్ ఎంపిక ఈఎల్ఎస్ఎస్

Updated : 25 Jan 2021 15:56 IST

ఈఎల్ఎస్ఎస్ ఫండ్లు సాధారణంగా ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్లు. అంటే అవి అన్ని రంగాలలోని సంస్థలలో పెట్టుబడులను కేటాయిస్తాయి, అందువల్ల వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియోఉంటుంది. అలాగే, ఇది మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోను మార్చడానికి అవ‌కాశం ఇస్తుంది, అందువల్ల అవి సంద‌ర్భానికి త‌గిన‌ట్లుగా అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మెరుగ్గా ఉంటాయి. ప‌న్ను ఆదాతో పాటు ఈఎల్ఎస్ఎస్‌లో ఈ స‌దుపాయం అద‌నంగా ఉంటుంది.

సంపదను సృష్టించడానికి ఉత్తమ మ్యూచువల్ ఫండ్ ఎంపిక ఈఎల్ఎస్ఎస్ ఎందుకంటే..
చాలా మంది పన్ను ఆదా ప్ర‌ణాళిక లేకుండా  సెక్షన్ 80 సి కింద ప్రయోజనాన్ని కోల్పోతారు. ట్యాక్స్ సేవింగ్ ఫండ్లలో లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉన్న  మూడు సంవత్సరాలు  పెట్టుబ‌డులు కొన‌సాగించి ఆ తర్వాత నిష్క్రమించవచ్చు. అయితే, మీరు 10/20 సంవత్సరాలు పెట్టుబడి పెడితే చ‌క్ర‌వ‌డ్డీతో గణనీయమైన సంపదను సృష్టించగలదు.
ఉదాహ‌ర‌ణ‌కు..
మీరు 30 శాతం అత్యధిక ఆదాయపు పన్ను పరిధిలో ఉన్నారని అనుకుందాం, ఆదాయపు పన్నులో 4 శాతం సెస్‌తో సహా సెక్ష‌న్ 80సి ద్వారా రూ. 46,800 వరకు ఆదా చేయవచ్చు. అప్పుడు, మీరు మళ్లీ సంవత్సరానికి రూ. 46,000 ఆదా చేసినను ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు, దానిపై కూడా దీర్ఘకాలిక కాంపౌండింగ్ వ‌డ్డీని సంపాదించవచ్చు.

ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్ సగటున 10 శాతం రాబడిని ఇస్తుందని అనుకుందాం ( మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై ఎటువంటి రాబ‌డి హామీ ఉండ‌దు).  10 సంవత్సరాలు ఫండ్‌లో రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెడితే, మీరు రూ. 25.8 ల‌క్ష‌ల కార్ప‌స్‌ను సృష్టించవచ్చు. 
ఇప్పుడు, ఆ ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్‌ ఫండ్ అయితే, మీరు సంవత్సరానికి రూ. 46,800 ను పన్నులుగా ఆదా చేయవచ్చు.  ఆ డబ్బును మళ్లీ అదే ఫండ్‌లో తిరిగి పెట్టుబడి పెడితే, మీరు రూ. 8 లక్షల అదనపు కార్పస్‌ను పొంద‌వ‌చ్చు.
కాబట్టి, ఈఎల్ఎస్ఎస్‌ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు రెగ్యులర్ ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే వ‌చ్చే రూ. 25 లక్షలపై రూ. 33 లక్షల కార్పస్‌ను సృష్టించవచ్చు. అయితే ఆదా చేసిన  ప‌న్నునే  కాకుండా మ‌రింత క‌లిపి పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించండి. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు