ఈపీఎఫ్ ఖాతాపై వ‌డ్డీ రాని సంద‌ర్భాలు

మీ పీఎఫ్‌ ఖాతా పనిచేయకపోతే దానిపై వ‌డ్డీ ల‌భించ‌దు..........

Published : 25 Dec 2020 16:28 IST

మీ పీఎఫ్‌ ఖాతా పనిచేయకపోతే దానిపై వ‌డ్డీ ల‌భించ‌దు.

ఎప్పుడైతే మీ ఈపీఎఫ్ ఖాతా నిలిచిపోతుందో అప్ప‌టినుంచి ఖాతాలో ఉన్న డ‌బ్బుపై వ‌డ్డీ ల‌భించ‌దు. అప్ప‌టివ‌ర‌కు దానిపై వ‌డ్డీ పొంద‌వ‌చ్చు. ఈపీఎఫ్ఓ నిబంధ‌న‌ల ప్ర‌కారం, ఈపీఎఫ్ ఖాతాలోని మొత్తంపై వ‌డ్డీ ల‌భించ‌ని సంద‌ర్భాలు మ‌రికొన్ని ఉన్నాయి.

  • 55 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఉద్యోగి ప‌ద‌వీవిర‌మ‌ణ పొందితే
  • చందాదారుడు విదేశాల‌కు శాశ్వతంగా వెళ్లిపోతే
  • చందాదారుడు మ‌ర‌ణిస్తే… ఈ మూడు కేసుల్లో ఈపీఎఫ్‌పై వ‌డ్డీ ల‌భించ‌దు.
  • ఉద్యోగం మానేసిన త‌ర్వాత 36 నెల‌ల వ‌ర‌కు పీఎఫ్ విత్‌డ్రా చేసుకోక‌పోయినా ఆ ఖాతాలో మొత్తంపై వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. ఆ త‌ర్వాత నుంచి వ‌డ్డీ రాదు.

ఐదేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరంతర సేవలను అందించినట్లయితే ఉద్యోగికి చెల్లించవలసిన ఈపీఎఫ్ బ్యాలెన్స్ పన్ను నుంచి మినహాయింపు పొందుతుంది. ఉద్యోగి వేర్వేరు సంస్థలలో సేవలను అందించిన సందర్భాల్లో, ఈపిఎఫ్ బ్యాలెన్స్‌లు ఖాతాకు బదిలీ చేస్తే, పన్నుల ప్రయోజనం కోసం ఉద్యోగి ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరంతర సేవలను అందించారని భావిస్తారు. ఈపీఎఫ్ ఖాతాకు కొత్త సహకారం లేకపోతే, ఖాతా పనిచేయకపోయినా వడ్డీని సంపాదిస్తూనే ఉంది. అయితే అప్పుడు దానిపై ప‌న్ను వ‌ర్తిస్తుంది.’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని