ఆన్‌లైన్‌లో నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు అవ‌కాశ‌మిస్తున్న `ఈపీఎఫ్‌వో`

ఈపీఎఫ్‌వో స‌భ్యుడు కొత్త పీఎఫ్ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌డం ద్వారా త‌న ఈపీఎఫ్, పీఎఫ్ ఖాతా నామినీని మార్చ‌వ‌చ్చు.

Updated : 19 Nov 2021 13:42 IST

ఈపీఎఫ్ఓ చందాదారులు ఈపీఎఫ్‌, ఈపీఎస్ నామినేష‌న్‌ను ఇప్పుడు డిజిట‌ల్‌గా నియ‌మించుకోవ‌చ్చు. చందాదారు కుటుంబ‌స‌భ్యుల సామాజిక భ‌ద్ర‌త కోసం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్‌(ఈపీఎఫ్ఓ) ప్రావిడెంట్ ఫండ్‌(పీఎఫ్‌) నామినేష‌న్ సౌక‌ర్యాన్ని అందిస్తుంది.  ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ (epfindia.gov.in) ద్వారా లాగినయ్యి నామినేష‌న్‌ను దాఖ‌లు చేయ‌వ‌చ్చు. ఈపీఎఫ్ ఖాతాదారుడు త‌మ ఈపీఎఫ్‌/  పీఎఫ్ ఖాతా నామినీని మార్చుకోవ‌చ్చు కూడా. ఇందుకోసం చందాదారుడు త‌న పీఎఫ్ నామినీని మార్చ‌మ‌ని ఈపీఎఫ్‌వోను అడ‌గ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. 

ఈపీఎఫ్‌/  పీఎఫ్ నామినేష‌న్‌ను ఆన్‌లైన్ ద్వారా మార్చుకునే విధానాన్ని ఈపీఎఫ్ఓ త‌న అధికారిక ట్విట్ట‌ర్‌ ఖాతా ద్వారా తెలియ‌జేసింది. తాజాగా ఏదైతే పేరును పీఎఫ్ నామినేష‌న్‌లో పేర్కొన్నారో.. పీఎఫ్ నామినీలో అదే పేరు చివ‌రిదిగా ప‌రిగ‌ణిస్తారు. అయితే మునుప‌టి పీఎఫ్ నామినేష‌న్ ఖాతాదారుడే స్వ‌యంగా ర‌ద్దు చేసిన‌ట్లు ప‌రిగ‌ణిస్తారు.

పీఎఫ్ నామినేష‌న్ ఆన్‌లైన్‌లో దాఖ‌లు చేసే విధానం..

1. ముందుగా epfindia.gov.in లో లాగిన్ అవ్వండి.

2. స‌ర్వీసెస్ సెక్ష‌న్‌కి వెళ్లి, ఫ‌ర్ ఎంప్లాయిస్‌(For Employees) బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి.

3. ఆపై మెంబ‌ర్ యూఏఎన్ లేదా ఆన్‌లైన్ స‌ర్వీసెస్‌(ఓసీఎస్‌/ ఓటీసీపీ) బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి.

4. మీ యూఏఎన్‌, పాస్‌వ‌ర్డ్‌తో లాగిన్ చేయండి.

5. మేనేజ్‌ బ‌ట‌న్ క్రింద ఈ-నామినేష‌న్‌(E-Nomination) సెల‌క్ట్ చేయండి.

6. మీ ఫ్యామిలి డిక్ల‌రేష‌న్ అప్‌డేట్ కోసం Yesపై క్లిక్ చేయండి.

7. 'యాడ్ ఫ్యామిలీ డిటేల్స్‌' బ‌ట‌న్‌పై క్లిక్ చేసి వివ‌రాలు ఇవ్వండి. 

8. పీఎఫ్ మొత్తంలో ఎవ‌రెవ‌రికి ఎంతెంత మొత్తం ఇవ్వాలో తెలియ‌జేసేందుకు..'నామినేష‌న్ డిటేల్స్‌' పై క్లిక్ చేయండి.

9. డిక్ల‌రేష‌న్ ఇచ్చిన త‌ర్వాత‌, 'సేవ్ ఈపీఎఫ్ నామినేష‌న్' పై క్లిక్ చేయండి

10. ఓటీపీ జ‌న‌రేట్ చేసేందుకు 'E-Sign' బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి.

11. ఆధార్ కార్డ్‌తో లింక్ చేయ‌బ‌డిన మీ మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది

12. ఓటీపీని ఎంట‌ర్ చేస్తే ఈపీఎఫ్‌లో మీ ఇ-నామినేష‌న్ న‌మోదు ప్ర‌క్రియ విజ‌య‌వంతం అవుతుంది. 

ఈపీఎఫ్‌వో స‌భ్యులు త‌మ కుటుంబాల‌కు సామాజిక భ‌ద్ర‌త అందించ‌డానికి ఈ రోజే ఇ-నామినేష‌న్‌ను దాఖ‌లు చేయండి. నామినేష‌న్ డిజిట‌ల్‌గా దాఖ‌లు చేయ‌డానికి పైనున్న ద‌శ‌ల‌ను అనుస‌రించండి. స‌భ్యులు ఒక‌టి కంటే ఎక్కువ సార్లు పీఎఫ్ నామినీని జోడించ‌వ‌చ్చు. ఈపీఎఫ్ నామినేష‌న్ ఆన్‌లైన్‌లో దాఖ‌లు చేసిన త‌ర్వాత దీనికి సంబంధించిన ప‌త్రాల‌ను నేరుగా ఇవ్వ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని